Narayana Health: దేశంలోనే తొలిసారి.. రూ.10 వేలకు కోటి ఆరోగ్య బీమా!

బెంగుళూరుకు చెందిన హాస్పిటల్ చైన్ నారాయణ హెల్త్ కొత్త వెంచర్ నారాయణ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (NHIL) తన మొదటి బీమా ఉత్పత్తిని ప్రకటించింది.

'అదితి' అనే పేరుతో పిలువబడే ఈ ప్లాన్, కుటుంబాలకు సమగ్ర కవరేజీని అందిస్తుంది. దీనిలో శస్త్రచికిత్సలకు రూ.1 కోటి వరకు మరియు వైద్య నిర్వహణ ఖర్చులకు రూ.5 లక్షలు వరకు భరోసా ఇవ్వబడుతుంది.

తక్కువ ధరలో మెరుగైన కవరేజీ..
ఈ ప్లాన్ దేశంలోని ప్రజలకు ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు.. డాక్టర్ దేవి శెట్టి నేతృత్వంలోని ఈ హెల్త్‌కేర్ సంస్థ ఒక ప్రకటనలో, ఈ కొత్త బీమా ప్లాన్ సంవత్సరానికి కేవలం రూ.10,000/- ప్రీమియంతో అందుబాటులో ఉంటుందని, ఇది సాధారణంగా ఇలాంటి బీమా ప్లాన్‌లకు చెల్లించే ప్రీమియం కంటే చాలా తక్కువ అని తెలిపింది. గరిష్టంగా నలుగురు సభ్యులతో కూడిన కుటుంబాలు ఈ ప్లాన్‌కు అర్హత కలిగి ఉంటాయి.

భారత్‌లో మొదటి ఆసుపత్రిగా..
నారాయణ హెల్త్ భారతదేశంలో బీమా కంపెనీని కలిగి ఉన్న మొదటి ఆసుపత్రిగా నిలిచింది. దేశవ్యాప్తంగా 21కి పైగా ఆసుపత్రులు, అనేక క్లినిక్‌లతో విస్తృత నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. బెంగళూరులోనే, ఈ సంస్థకు 7 ఆసుపత్రులు మరియు 3 క్లినిక్‌లు ఉన్నాయి. 

LPG Gas Cylinder Price Cut: గ్యాస్‌ సిలిండర్ ధర తగ్గింపు.. ఎంతంటే..

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జన్మించిన డాక్టర్‌ దేవి ప్రసాద్‌ శెట్టి కార్డియాక్ సర్జన్‌. ఆయన లక్షకు పైగా గుండె ఆపరేషన్లు చేశారు. వైద్య రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం దేవి శెట్టిని 2004లో పద్మశ్రీ , 2012లో పద్మభూషణ్‌ పురస్కారాలతో గౌరవించింది.

#Tags