Election Commission: సార్వత్రిక ఎన్నికల్లో 65.79 శాతం పోలింగ్‌

ఇటీవ‌ల జ‌రిగిన‌ లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదయింది.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో 65.79 శాతం పోలింగ్‌ నమోద‌యిందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్‌ బ్యాలెట్లను ఇంకా ఇందులో కలపని కారణంగా తుది పోలింగ్‌ శాతంలో మార్పులు ఉంటాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.

2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో 67.40 శాతం పోలింగ్‌ నమోదైంది. 2019 ఎన్నికలనాటికి దేశవ్యాప్తంగా 91.20 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఆనాడు వారిలో 61.50 కోట్ల మంది మాత్రమే ఓటేశారు. ఇటీవల ముగిసిన 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 96.88 కోట్లకు పెరగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి విడివిడిగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు, మొత్తంగా ఓటింగ్‌ శాతాల సమగ్ర వివరాలు తమకు అందాక అందరికీ అందుబాటులోకి తెస్తామని ఈసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

World Record: ప్రపంచ రికార్డ్‌.. సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసిన 64.2 కోట్ల మంది

#Tags