Skip to main content

World Record: ప్రపంచ రికార్డ్‌.. సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసిన 64.2 కోట్ల మంది

లోక్‌సభ ఎన్నికల్లో మొత్తంగా 64.2 కోట్ల మంది భారతీయ పౌరులు ఓటు హక్కును వినియోగించుకుని నూతన ప్రపంచ రికార్డును సృష్టించారని ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు.
Poll Body Says Over 64 Crore People Voted In 2024 Lok Sabha Elections

దేశ చరిత్రలో తొలిసారి ఓట్ల లెక్కింపునకు ముందు తోటి కమిషనర్లతో సహా సీఈసీ జూన్ 3వ తేదీ ఢిల్లీలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై మాట్లాడారు.  

జీ7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ 
‘31.2 కోట్ల మంది మహిళలుసహా 64.2 కోట్ల మంది ఓటేశారు. ఈ సంఖ్య జీ7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ. 27 యురోపియన్‌యూనియన్‌ దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ. ఈ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లందరికీ అభినందనలు’ అంటూ సీఈసీ వేదికపై లేచి నిలబడి ఓటర్లకు అభినందనలు తెలిపారు. ‘ఎన్నికల సిబ్బంది జాగ్రత్త, అప్రమత్తత వల్లే తక్కువ చోట్ల మాత్రమే రీపోలింగ్‌ చేపట్టాల్సి వచ్చింది. 2019లో 540 చోట్ల రీపోలింగ్‌ జరిగితే ఈసారి 39 మాత్రమే జరిగాయి’ అని పేర్కొన్నారు.

AP Election Results Live Updates: ఏపీ ఎన్నికల ఫలితాలు.. కౌంటింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్ ఇవే..

Published date : 04 Jun 2024 03:25PM

Photo Stories