Supreme Court Order: ‘సేవా లోపం’ పేరుతో లాయర్లపై కేసు వేయలేరు: సుప్రీంకోర్టు 

లాయర్లు తమ క్లయింట్‌లకు అందించే సేవలు ప్రత్యేకమైనవన్న విష‌యంలో సుప్రీమ్ కోర్టు తీర్పునిచ్చింది..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: వినియోగదారుల రక్షణ చట్టం కింద లాయర్లపై దావా వేసే విషయంలో సుప్రీంకోర్టు మే 14న కీలక తీర్పు వెలువరించింది. న్యాయవాద వృత్తి, లాయర్లు తమ క్లయింట్‌లకు అందించే సేవలు ప్రత్యేకమైనవని, వాటిని వినియోగదారుల రక్షణ చట్టం–1986 కింద ప్రశ్నించలేమని జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిశ్రాలతో కూడిన ధ్విసభ్య ధర్మాసనం పేర్కొంది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ (ఎన్‌సీడీఆర్‌సీ) 2007లో ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ.. పలు న్యాయవాద సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ పై న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

Military Training: ‘ఎక్సర్‌ సైజ్‌ శక్తి’ సైనిక శిక్షణ

#Tags