Cable Bridge: దేశంలో తొలి తీగల రైల్వే వంతెన సిద్ధం

రైల్వేశాఖ మరో ఘనతకు చేరువైంది. జమ్మూలోని రియాసీ జిల్లాలో చేపట్టిన దేశంలోనే మొట్టమొదటి తీగల రైల్వే వంతెన నిర్మాణం పూర్తయింది. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. 11 నెలల వ్యవధిలో ఈ రైల్వే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు ఆయన ట్విటర్‌ వేదికగా తెలిపారు. వంతెనను 96 ప్రధాన తీగలతో అనుసంధానించినట్లు వివరించారు. మొత్తం తీగల పొడవు 653 కిలోమీటర్లు ఉందని వెల్లడించారు. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో ఈ వంతెన పనులు చేపట్టారు. మొత్తం పొడవు 725 మీటర్లు. ఈ అంజీఖడ్‌ తీగల రైల్వే వంతెన.. జమ్మూ-బారాముల్లా మార్గంలోని కాట్రా రైసీ సెక్షన్లను కలుపుతుంది. హిమాలయ పర్వతాల మధ్య దాదాపు 1086 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జి 216 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులనూ తట్టుకోగలదని అధికారులు చెబుతున్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags