Heavy Water Plant: దేశంలోనే ఉత్పత్తి, ఎగుమతుల్లో ముందంజలో ఉన్న వాటర్‌ ప్లాంట్ ఇదే..

భారజలం ఉత్పత్తి, ఎగుమతుల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మణుగూరు భారజల కర్మాగారం ప్రత్యేక గుర్తింపు కలిగి తలమానికంగా నిలుస్తోంది.

భారజల కర్మాగారంలో ఉత్పత్తి అవుతున్న అక్సిజన్‌–18 ఎన్‌రిచ్‌డ్‌ వాటర్‌ పరీక్షలు ఇటీవల ముంబై, అమెరికాలో నిర్వహించగా విజయవంతమయ్యాయి.  

గోదావరి నది, బొగ్గుగనుల సహకారం: గోదావరి నది, సింగరేణి బొగ్గుగనుల అందుబాటులో ఉండడంతో 1985లో ఈ కర్మాగారం ఏర్పాటైంది. 1991లో భారజల ఉత్పత్తి ప్రారంభమైంది.

దేశంలోనే అత్యధిక ఉత్పత్తి: ఇక్కడ ఉత్పత్తి అయ్యే భారజలం నాణ్యతలో అత్యుత్తమమైనది. దేశంలోని అన్ని భారజల కర్మాగారాలకన్నా ముందంజలో నిలిచి, ఆసియా ఖండంలోనే అత్యధిక భారజలం ఉత్పత్తి చేస్తుంది.

ఎగుమతుల్లో 60% వాటా: భారత భారజల బోర్డు పరిధిలో ఎగుమతుల్లో 60% మణుగూరు కర్మాగారం నుంచే జరుగుతుంది.

వినియోగం: ఈ భారజలాన్ని న్యూక్లియర్ రియాక్టర్లు, అణువిద్యుత్ కేంద్రాల్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, జర్మనీ, స్విట్జర్లాండ్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు. ఔషధాల తయారీ, ఆప్టికల్ ఫైబర్ ఉత్పత్తి, ఆర్గానిక్ ఎల్ఈడీ తెరల్లో కూడా వాడతారు.

International Labour Organization Report: దేశం మొత్తం రొయ్యల ఉత్పత్తిలో 76 శాతం ఏపీలోనే..

ఆదాయం: గత ఏడాది భారజలం ఎగుమతి ద్వారా భారత భారజల బోర్డు రూ.750 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది.
తాజా ఎగుమతి: జూన్‌ 17న దక్షిణ కొరియాకు 20 వేల లీటర్ల (20 టన్నులు) భారజలాన్ని ఎగుమతి చేశారు.

ఆక్సిజన్-18 ఎన్‌రిచ్‌డ్‌ వాటర్: మణుగూరు కర్మాగారంలో ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్-18 ఎన్‌రిచ్‌డ్‌ వాటర్ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ ఆధారంగా ఆక్సిజన్‌–18 వాటర్‌ ఉత్పత్తి ప్లాంట్లను పెంచాలని భారజల బోర్డు నిర్ణయం తీసుకుంది

విస్తరణ ప్రణాళికలు: పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి మరో 100 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో "ఎక్స్ఛేంజ్-3" యూనిట్‌ను స్థాపించాలని భారత భారజల బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

కేన్సర్ చికిత్స: కేన్సర్ బాధితులకు చికిత్సలో ఈ వాటర్ ఉపయోగపడుతుంది. పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (PET) స్కానింగ్ ద్వారా దీన్ని కేన్సర్ బాధితుల శరీరాల్లో ప్రవేశపెడితే వ్యాధి కణాలను గుర్తించి చికిత్స అందిస్తారు. 

Indian Painted Frog: కవ్వాల్‌ టైగర్‌జోన్‌లో కనిపించిన ఇండియన్‌ పెయింటెడ్‌ ఫ్రాగ్.. దీని పేరు ఇదే!

#Tags