Chandipura Virus: గుజరాత్‌, రాజస్థాన్‌లలో ప్రమాదకర వైరస్‌ కలకలం

అత్యంత ప్రమాదకరమైన చాందిపురా వైరస్ ఇప్పుడు గుజరాత్‌ను దాటి రాజస్థాన్‌లోకి ప్రవేశించింది.

రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లాలో చాందిపురా వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

వైద్యాధికారులు తెలిపిన వివరాలు ఇవే..

  • ఉదయపూర్ జిల్లాలోని ఖేర్వాడా బ్లాక్‌లోని రెండు గ్రామాలలో చాందిపురా వైరస్ కేసులు నమోదయ్యాయి.
  • ఖేర్వాడా బ్లాక్‌లోని నల్ఫాలా, అఖివాడ గ్రామాలకు చెందిన ఇద్దరు చిన్నారులు ఈ వైరస్‌ బారినపడి హిమ్మత్‌నగర్‌లో చికిత్స పొందుతున్నారు.
  • ఈ రెండు గ్రామాలు గుజరాత్ సరిహద్దుల్లో ఉన్నాయి. ఈ ప్రాంతానికి చెందినవారు ఉపాధి కోసం గుజరాత్ సరిహద్దు ప్రాంతాలకు వలస వెళుతుంటారు.
  • ఈ వైరస్‌ బారినపడిన చిన్నారులలో ఒకరు మృతి చెందారని తాజా సమాచారం.
  • చాందిపురా వైరస్‌ దోమలు, పురుగులు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది.
  • బాధితులకు చికిత్స అందించడంలో ఆలస్యమైతే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Zika Virus: జాగ్ర‌త్త‌.. కలకలం రేపుతున్న జికా వైరస్‌.. రాష్ట్రాలకు కేంద్రం సూచ‌న‌లు

#Tags