Increase of MSP : వరికి మద్దతు ధర రూ.117 పెంచిన కేంద్రం

వరికి కనీస మద్దతు ధరను(ఎంఎస్‌పీ) రూ.117 పెంచుతూ కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 2024–25 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌కు సంబంధించి మొత్తం 14 పంటల ఎంఎస్‌పీని పెంచింది. వరి పంటకు ఎంఎస్‌పీని రూ.117 పెంచడంతో(5.35 శాతం) క్వింటాల్‌ వరి రూ.2,300కి చేరింది.

బుధవారం సాయంత్రం నిర్ణయాన్ని ప్రకటించిన కేంద్ర I&B మంత్రి అశ్విని వైష్ణవ్, వ్యవసాయ ఖర్చులతోపాటు ధరల కమిషన్ (CACP) సిఫార్సుల ఆధారంగా 14 ఖరీఫ్ పంటలకు MSPని కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఈ కీలక నిర్ణయం వెలువడింది.

High Court : బిహార్‌లో 65 శాతం కోటా రద్దు చేసిన హైకోర్టు!

#Tags