Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం– బాల రాముని ప్రాణ ప్రతిష్ట
చారిత్రాత్మకంగా ప్రాముఖ్యమైన ధార్మిక క్షేత్రం మాత్రమే కాకుండా రాజకీయపరంగా దేశంలో పెను మార్పులకు కారణమైన అయోధ్య రామమందిరంలో జనవరి 22, 2024న బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరిగింది.
అయోధ్య రామాలయ విశేషాలు:
- అయోధ్య: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం
- ముఖ్యమంత్రి: యోగి ఆదిత్యనాథ్
- గవర్నర్: ఆనందీబెన్ పటేల్
- ప్రధాన ఆలయ విస్తీర్ణం: 2.67 ఎకరాలు (3 అంతస్థులు)
- నిర్మాణ విస్తీర్ణం: 57,400 చదరపు అడుగులు
- ఆలయ శంకుస్థాపన: 05/08/2020
- నిర్మాణ శైలి: నగర శైలి
- గర్భగుడిలో బాల రాముడి ఎత్తు: 51 అంగుళాలు
- విగ్రహ శిల్పి: అరుణ్ యోగిరాజ్ (కర్ణాటక)
- శ్రీ రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఛైర్మన్: న్రిత్య గోపాల్ దాస్
- దేవాలయ ఆర్కిటెక్ట్: చంద్రకాంత్ సోంపుర/ఆశీష్ సోంపుర/నిఖిల్ సోంపుర
- అయోధ్య కేసులో పోరాడిన ప్రముఖ న్యాయవాది: ఓ. పరసరన్
- నిర్మాణ సంస్థలు: ప్రధాన దేవాలయాన్ని ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించగా, ఇతర నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ చేపడుతున్నారు.
- అయోధ్య రామ మందిరం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ దేవాలయం. మొదటిది కంబోడియాలోని అంకోర్వాత్ (విష్ణు దేవాలయం), కాగా రెండోది తమిళనాడులోని తిరుచురాపల్లిలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం.
#Tags