Gaganyaan Mission : అంత‌రిక్షంలోకి 4 వ్యోమగాములు.. 20 ఈగ‌లు..

త్వరలో నిర్వహించనున్న గగన్‌యాన్‌ ప్రయోగానికి సంబంధించి ఇస్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది.

త్వరలో నిర్వహించనున్న గగన్‌యాన్‌ ప్రయోగానికి సంబంధించి ఇస్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా నలుగురు వ్యోమగాములతో పాటు 20 ఈగలను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది.

Vigyan Dhara Scheme : విజ్ఞాన్‌ ధార పథకానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం..

ఇందులో భాగంగా డ్రోసోఫిలియా మెలనోగాస్కర్‌ (ఫ్రూట్‌ ఫ్లై) జాతికి చెందిన 10 ఆడ, 10 మగ ఈగలు గగన్యాన్లో పయనం కానున్నాయి. మెలనోగాస్కర్‌ ఈగల విసర్జన వ్యవస్థ మానవుని విసర్జన వ్యవస్థతో దాదాపు 77శాతం పోలి ఉంటుంది. అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు వ్యోమగాముల ఆరోగ్యంలో వచ్చే మార్పులను మరింత సునిశితంగా పరిశీలించేందుకు ఇస్రో ఈ ఆలోచన చేసింది. 

75 వ్య‌వ‌సాయ యూనివ‌ర్సిటీల్లో..

అంత‌రిక్షంలోకి ప్ర‌యాణించ‌నున్న ఈగ‌ల‌కు అవ‌స‌ర‌మైన వ్యవస్థలతో ఉన్న కిట్‌ను త‌యారు చేసేందుకు మొత్తం 75 వ్య‌వ‌సాయ యూనివ‌ర్సిటీలు పోటీ ప‌డ‌గా.. అందులోంచి కర్ణాటకలోని ధార్వాడ వ్య‌వసాయ యూనివ‌ర్సిటీ చేసిన డిజైన్‌ను ఎంపిక చేశారు. ఫ్రూట్‌ ఫ్లై హ్యాబిటేట్‌ (ఎఫ్‌ఎఫ్‌హెచ్‌) కిట్‌గా పేరొందిన‌ దీని బరువు 2.3 కిలోలు ఉండ‌గా.. ఒక్కో కిట్‌లో కనీసం 15 ఈగలు ఉండగలిగేలా గొట్టాలుంటాయి.

Aparajita Bill: అత్యాచార దోషులకు మరణ శిక్ష.. ‘అపరాజిత’ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

#Tags