Egg Production : గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం గుడ్ల ఉత్ప‌త్తిలో ఏపీ తొలి స్థానం..

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది.

అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. అలాగే ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలోనూ మొదటి స్థానం దక్కించుకుంది. ఇవేకాకుండా మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానంలో, పాల ఉత్పత్తిలో ఐదో స్థానంలో నిలిచింది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 2023–24 సామాజిక, ఆర్థిక‌ సర్వే ఈ వివరాలను వెల్లడించింది. 2022–23 ఆర్థిక ఏడాదిలో రాష్ట్రంలో పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పాటు లభించిందని సామాజిక, ఆర్థిక సర్వే పేర్కొంది.

By-Election Notification : డిసెంబ‌ర్ 3న ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుద‌ల‌

పెరిగిన ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం

ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందని సర్వే పేర్కొంది. ప్రస్తుతం 5.68 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు ఉండగా హెక్టార్‌కు ఉత్పత్తి 19.81 టన్నులుగా ఉందని తెలిపింది. 2022–23లో 18.95 లక్షల మెట్రిక్‌ టన్నుల క్రూడ్‌ పామ్‌ ఆయిల్‌ ఉత్పత్తి కాగా 3.31 లక్షల మెట్రిక్‌ టన్నుల పామా­యిల్‌ ఉత్పత్తి అయినట్లు పేర్కొంది. గత మూడేళ్లలోనే 18 జిల్లాల్లో 124 కొత్త మండలాల్లో 42,098 రైతులు నూత­నంగా 1,13,670 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ తోటల పెంపకాన్ని చేపట్టారని తెలిపింది.

Greenfield Highway: ఏపీలో మరో గ్రీన్‌ ఫీల్డ్ హైవే.. ఈ హైవే ప్రధాన అంశాలివే..

రైతు భరోసా కేంద్రాల ద్వారా మెరుగైన సేవలు..

ఆంధ్రప్రదేశ్‌ అత్యంత సంపన్న పశు సంపదను కలిగి ఉందని, దీంతో పశు సంవర్థక రంగం ప్రముఖ స్థానంలో ఉందని సామాజిక, ఆర్థిక సర్వే–2023–24 తెలిపింది. రైతు భరోసా కేంద్రాల్లో 6,542 మంది పశు సంవర్థక సహాయకులను నియమించడం ద్వారా పశువుల యజమానులకు అవసరమైన సేవలందించారని వెల్లడించింది. పశు వైద్యుల మార్గదర్శకత్వంలో పశు సంవర్థక సహాయకులు ప్రథమ చికిత్స వంటి సేవలను ఆందిస్తున్నారని వివరించింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

రైతు భరోసా కేంద్రాల ద్వారా 75 శాతం సబ్సిడీతో రైతులకు సరి్టఫైడ్‌ పశుగ్రాసం విత్తనాలను, 60 శాతం సబ్సిడీతో చాఫ్‌ కట్టర్లను పంపిణీ చేశారని వెల్లడించింది. అలాగే 2,02,052 మందికి పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను పంపిణీ చేసినట్లు పేర్కొంది. రైతుల ఇంటి వద్దే వెటర్నరీ సేవలను అందించేందుకు గత ప్రభుత్వం రెండు దశల్లో నియోజకవర్గానికి రెండు చొప్పున మొబైల్‌ అంబులేటరీ వెటర్నరీ క్లినిక్‌లను ఏర్పాటు చేసిందని సర్వే తెలిపింది.

New Fish Species: మూడు కొత్త ర‌కం చేపలను క‌నుగొన్న శాస్త్రవేత్తలు.. ఇవి క‌నిపించేది ఈ రాష్ట్రాల్లోనే..

#Tags