Agni 4 : అగ్ని–4 క్షిపణి పరీక్ష విజయవంతం..

అగ్ని–4 బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగ పరీక్షను భారత్‌ సెప్టెంబర్‌ 6న విజయవంతంగా పూర్తి చేసింది. మధ్యస్థ రేంజ్‌ క్షిపణి అయిన అగ్ని–4ను ఒడిశాలోని చాందీపూర్‌ నుంచి ప్రయోగించినట్టు అధికారులు తెలిపారు. భారత న్యూక్లియర్‌ కమాండ్‌ అథారిటీలో భాగమైన స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌ కమాండ్‌ దీనిని నిర్వహించిందన్నారు. అగ్ని–4తో లక్ష్య పరిధి మరింత పెరిగింది. 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదిస్తుంది. 20 మీటర్ల పొడవున్న ఈ క్షిపణి వెయ్యి కిలోల పేలోడ్‌ను మోసుకుపోగలదు.
Himanchal Pradesh Assembly : ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పించన్‌ బంద్‌..

#Tags