Mahakumbh 2025: మహాకుంభమేళాలో.. తొమ్మిదేళ్ల నాగసన్యాసి.. గడ్డకట్టే చలిలో కఠోర తపస్సు

మహాకుంభమేళా జనవరి 13వ తేదీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభంకానుంది.

ఇందుకోసం ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు ఇప్పటికే పలువురు సాధువులు ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్నారు. వారిలో తొమ్మిదేళ్ల నాగసన్యాసి గోపాల్‌ గిరి మహారాజ్ ఒకరు. ఈయన హిమాచల్ ప్రదేశ్‌లోని చంపా నుంచి వచ్చారు. 

గడ్డకట్టే చలి మధ్య శరీరంపై ఏమీ లేకుండా..
మహాకుంభ్‌లో అతి పిన్న వయస్కుడైన నాగ సన్యాసిగా గోపాల్‌ గిరి నిలిచారు. ప్రస్తుత శీతాకాలంలో గడ్డకట్టే చలి మధ్య గోపాల్‌ గిరి మహారాజ్‌ శరీరంపై ఎటువంటి దుస్తులు లేకుండా, కవలం బూడిద పూసుకుని తపస్సు కొనసాగిస్తుంటారు. గోపాల్‌ గిరికి మూడేళ్ల వయసు ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు బాలుడిని ఒక గురుపుకు అప్పగించారు. నాటి నుంచి గోపాల్‌ గిరి సాధన ప్రారంభించారు.

History of Kumbh Mela: 144 ఏళ్ల తర్వాత వచ్చిన గొప్ప వేడుక.. మహా కుంభమేళా ఎలా మొదలైంది?

గిరి మహారాజ్ మీడియాతో మాట్లాడుతూ.. మహా కుంభమేళా తర్వాత తన చదువును తిరిగి కొనసాగిస్తానని అన్నారు. తనకు మొదట్లో తనకు ఇంటికి దూరమయ్యాననే బాధ ఉండేదని, అయితే తన గురువు అందించిన జ్ఞానం, మార్గదర్శకత్వం తనను ప్రాపంచిక అనుబంధాల నుండి దూరంగా ఉంచాయని అన్నారు. 

కాగా గోపాల్ గిరి మహారాజ్ దినచర్య చాలా క్రమశిక్షణతో కూడి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలోనే మేల్కొని, తన దైనందిన కార్యకలాపాలు నిర్వహిస్తారు. తరువాత గురువు సమక్షంలో వేదాలను నేర్చుకుంటారు. మహా కుంభమేళాలో గోపాల్ గిరి మహారాజ్ కత్తి కళను ప్రదర్శిస్తున్నారు. ఈ కళతో పాటు గోపాల్‌ గిరి చేసే అతీంద్రియ తపస్సు అతనికి ప్రత్యేక గుర్తింపునిచ్చింది.

Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌ను తీర్థరాజం అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?

#Tags