Number of Women MPs:: పద్దెనిమిదో లోక్‌సభకు ఎన్నికైన 74 మంది మహిళా ఎంపీలు

పద్దెనిమిదో లోక్‌సభకు మొత్తం 74 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు.

543 మంది సభ్యులు గల లోక్‌సభలో మహిళా ఎంపీలు 13.62 శాతం మాత్రమే. ఈ 74 మందిలో 30 మంది గత లోక్‌సభలోనూ సభ్యులు కాగా, ఒకరు రాజ్యసభ సభ్యురాలు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళలు పోటీచేయగా.. బీజేపీ అత్యధికంగా 69 మందిని బరిలోకి దింపింది. 

కాంగ్రెస్‌ 41 మంది మహిళలకు టికెట్లిచ్చింది. చట్టసభల్లో 33 శాతం సీట్లను రిజర్వు చేసే మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంటు ఆమోదం పోందాక జరిగిన తొలి ఎన్నికలివి. అయితే మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఇంకా అమల్లోకి రాలేదు. బీజేపీ నుంచి హేమమాలిని, టీఎంసీ నుంచి మహువా మొయిత్రా, ఎన్‌సీపీ (ఎస్పీ) నుంచి సుప్రియా సూలే, ఎప్సీ నుంచి డింపుల్‌ యాదవ్‌లు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. 

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్, లాలూ కూతురు మీసా భారతి తొలిసారిగా నెగ్గి దేశం దృష్టిని ఆకర్షించారు. సమాజ్‌వాది పార్టీ నుంచి 25 ఏళ్ల ప్రియా సరోజ్‌ (మచిలీషహర్‌), 29 ఏళ్ల ఇర్కా చౌదరి (కైరానా)లు లోక్‌సభకు ఎన్నికైన అతిపిన్న వయసు మహిళా ఎంపీలు.

PM Narendra Modi: ఎన్డీఏ కూటమి నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రధాని మోదీ

దేశంలో అత్యధిక మంది మహిళా ఎంపీలను లోక్‌సభకు పంపిన రాష్ట్రంగా పశ్చిమబెంగాల్‌ నిలిచింది. బెంగాల్‌ నుంచి గెలిచిన 11 మంది మహిళా ఎంపీలూ టీఎంసీ వారే. భారత లోక్‌సభ చర్రితలో అత్యధికంగా 17వ లోక్‌సభలో 78 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. దక్షిణాఫ్రికాలో 46 శాతం, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో 35 శాతం, అమెరికాలో 29 శాతం మంది మహిళా ఎంపీలు ఉన్నారు. 

ఏ పార్టీ నుంచి ఎంద‌రంటే..
బీజేపీ 30
కాంగ్రెస్ 14
త‌`ణ‌మూల్ 11
స‌మాజ్‌వాది 4
డీఎంకే 3
జూడీయూ 2
ఎల్జేపీ 2
వైఎస్సార్‌సీపీ 1
ఎన్సీపీఎస్పీ 1
అకాళీద‌ళ్ 1
ఆర్జేడీ 1
జేఎంఎం 1
టీడీపీ 1
ఇత‌రులు 1

Delhi Election Results: వరుసగా మూడోసారి బీజేపీ క్లీన్‌స్వీప్‌.. తగ్గిన ఓటింగ్‌ శాతం

#Tags