Gold Deposit Found: చైనాలో బంగారు పంట.. విలువ రూ.7 లక్షల కోట్ల పైనే!!

చైనాలో అతి భారీ స్థాయిలో బంగారం నిల్వలు బయటపడ్డాయి.

ఈ బంగారం నిల్వలు సెంట్రల్ హూనాన్ ప్రావిన్స్‌లోని పింగ్‌జియాండ్ కౌంటీలోని వాంగూ గోల్డ్ ఫీల్డ్ ప్రాంతంలో తవ్వకాల్లో వీటిని గుర్తించారు. ఇక్కడ శాస్త్రవేత్తలు అంచనా వేసిన ప్రకారం.. 1,000 టన్నుల (10 లక్షల కిలోల) పైగా పసిడి లోహం ఉంది. ఒకేచోట ఈ స్థాయిలో బంగారం నిల్వలు బయటపడటం ప్రపంచంలో ఇదే తొలిసారి. 
 
భూ ఉపరితలం నుంచి 2 కి.మీ. దిగువన 300 టన్నులు, 3 కి.మీ. దిగువన 700 టన్నులు ఉన్నట్లు చెబుతున్నారు. దీని విలువ 80 బిలియన్‌ డాలర్ల (రూ.6.76 లక్షల కోట్లు) పైమాటే. సెంట్రల్‌ హునాన్‌ ప్రావిన్స్‌ను ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలు ఉన్న ప్రాంతంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ప్రతి టన్ను మట్టిలో 8 గ్రాముల బంగారముంటేనే దాన్ని హెచ్చు నాణ్యత కలిగిన ముడి ఖనిజంగా పరిగణిస్తారు. అలాంటిది హునాన్‌లో టన్ను మట్టిలో ఏకంగా 138 గ్రాముల చొప్పున స్వచ్ఛమైన స్వర్ణం ఉందని తేల్చారు. 

Best Cities: ప్రపంచంలో అత్యుత్తమ టాప్‌–10 నగరాలు ఇవే..

అంటే అత్యధిక నాణ్యత కలిగిన ముడి ఖనిజమని పేర్కొంటున్నారు. కళ్లు చెదిరే రీతిలో బంగారం నిల్వలు బయటపడడంతో చైనా గోల్డ్‌ పరిశ్రమకు మరింత ప్రోత్సాహం లభించనుంది. ప్రపంచ గోల్డ్‌ మార్కెట్‌ను డ్రాగన్‌ దేశం శాసించే రోజులు రాబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికే బంగారం ఉత్పత్తిలో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచమంతటా ఏటా ఉత్పత్తయ్యే బంగారంలో చైనా వాటా 10 శాతం. ఇకపై అది మరింత పెరుగబోతోంది. రోజురోజుకూ పసిడి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చైనా భారీగా లబ్ధి పొందనుంది.

Smallest Countries: ప్రపంచంలోనే టాప్ 10 చిన్న దేశాలు ఇవే..

 

#Tags