Covid Vaccine: కొవాగ్జ్‌ కార్యక్రమం ఏ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతోంది?

కరోనాపై పోరాటంలో సరైన సమయంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసుల్ని ప్రపంచ దేశాలకు పంపిణీ చేసినందుకు గాను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి వేదికగా భారత్‌కు వివిధ దేశాలు కృతజ్ఞతలు తెలిపాయి. సెప్టెంబర్‌ 21–27 వరకు జరిగిన సదస్సులో వివిధ దేశాధినేతలు భారత్‌కు ధన్యవాదాలు చెప్పారు. భారత్‌ సహకారం లేనిదే ప్రపంచంలో ఎన్నో దేశాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సక్రమంగా జరిగేది కాదని నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్‌ బుహారి ప్రశంసించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘‘కొవాగ్జ్‌’’ కార్యక్రమంలో భాగంగా భారత్‌ 100కిపైగా దేశాలకు 6.6 కోట్ల టీకా డోసుల్ని ఎగుమతి చేసింది.

కొవాగ్జ్‌..

అన్ని దేశాలకు(ముఖ్యంగా నిరుపేద దేశాలకు) కరోనా టీకాలను సమానంగా అందజేయాలనే ఉద్దేశంతో డబ్ల్యూహెచ్‌ఓ, వ్యాక్సిన్‌ గ్రూప్‌ గవీ వంటి పలు సంస్థలు కొవాగ్జ్‌(COVAX) కార్యక్రమాన్ని చేపట్టాయి. డబ్ల్యూహెచ్‌వో ఆధ్వర్యంలో ఇది కొనసాగుతోంది.

చ‌ద‌వండి: ఏ రెండు దేశాలకు ఐరాస సభలో ప్రసంగించే అవకాశం లేదు?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన ప్రపంచ దేశాలు
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 28
ఎక్కడ    : సెప్టెంబర్‌ 21–27 వరకు జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో...
ఎందుకు  : కరోనాపై పోరాటంలో సరైన సమయంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసుల్ని ప్రపంచ దేశాలకు పంపిణీ చేసినందుకు గాను...

 

#Tags