What is Hamas's Nukhba Force: నుక్భా ఫైటర్స్‌తో హమాస్‌కు ఉన్న‌ సంబంధం ఏమిటి?

ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. దీనిలో చాలా మంది ఇజ్రాయిలీలు మృతి చెందారు. లెక్కకు మించిన యూదులు బందీలుగా మారారు.
What is Hamas's Nukhba Force

హమాస్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్‌.. గాజా స్ట్రిప్‌ను శ్మశానవాటికగా మార్చివేసింది. అలాగే హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టే పనిలో పడింది. ఈ యుద్ధం నేపధ్యంలో నుక్భా ఫైటర్స్ పేరు వినిపిస్తోంది. ఇంతకీ వీరు ఎవరు? హమాస్‌తో వారికి సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Is Israel-Hamas War Impact On Global Economy: ఇజ్రాయెల్, హమాస్‌ల యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడనుందా?

హమాస్ ఒక పెద్ద విభాగం. దీనిలో కొన్ని గ్రూపులు ఉన్నాయి. ఇజ్రాయెల్‌పై దాడి చేసిన గ్రూపు పేరు ఇజ్ అల్ దిన్ అల్ ఖస్సామ్ బ్రిగేడ్. నుక్భా ఈ బ్రిగేడ్‌కు చెందిన అత్యంత క్రూరమైన పోరాట యోధులు. వారిలో మానవత్వం మచ్చుకైనా ఉండదు. ఎదురుగా ఏది అడ్డుపడినా, ధ్వంసం చేసుకుంటూ, ముందుకు వెళ్లడమే వారి లక్ష్యం. నుక్భా ఫైటర్స్  చాలా ప్రమాదకరమైనవారు. వారు పిల్లలను, వృద్ధులను కూడా విడిచిపెట్టరు.

నుక్భా ఫైటర్స్ ఇజ్రాయెల్‌కు నిరంతరం సవాల్‌గా నిలుస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్ చాలాకాలం నుంచి వారితో పోరాడుతూనే ఉంది. వారిని వెతికి పట్టుకుని మరీ మట్టుపెడుతూ వస్తోంది. నుక్భా ఫైటర్లు  అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించడంలో నిష్ణాతులు. వారు గెరిల్లా యుద్ధాన్ని అనుసరిస్తుంటారు. హమాస్ తన సైన్యాన్ని ఇజ్ అల్ దిన్ అల్ ఖస్సామ్ బ్రిగేడ్స్ ద్వారా రిక్రూట్ చేస్తుంది. వీరి శిక్షణ సమయంలో బలంగా ఉండే కొంతమంది యువకులను గుర్తిస్తారు. వారిని నుక్భా ఫైటర్స్‌గా  తీర్చిదిద్దుతారు. 

Israel-Palestine war: ఇజ్రాయెల్‌ పాలస్తీనాల‌ మధ్య భీకర యుద్ధం

#Tags