United Nations: ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
ఐక్యరాజ్యసమితిలోని ఆర్థిక, సామాజిక మండలిలోని నాలుగు కమిటీలకు భారత్ ఎన్నికైంది. ఐక్యరాజ్యసమితికి ఉన్న ఆరు కీలక విభాగాల్లో ఆర్థిక, సామాజిక మండలి ఒకటి. ఐరాస సర్వప్రతినిధి సభ నుంచి ఎన్నికైన 54 దేశాల ప్రతినిధులు ఈ మండలిలో సభ్యులుగా ఉంటారు. దీనికి సంబంధించిన.. సామాజిక అభివృద్ధి కమిషన్, ఎన్జీవోస్ కమిటీ, కమిషన్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్, ఆర్థిక–సామాజిక–సాంస్కృతిక హక్కుల కమిటీలలో భారత్‌కు ప్రాతినిధ్యం లభించింది. ఆర్థిక–సామాజిక–సాంస్కృతిక హక్కుల కమిటీకి భారత రాయబారి ప్రీతి శరణ్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు.
మొదటి ప్రపంచయుద్ధం (1914–1918) ముగిసిన తర్వాత ప్రపంచ శాంతి కోసం 1920లో నానాజాతి సమితి ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉండేది. అయితే ఈ సంస్థ రెండో ప్రపంచ యుద్ధాన్ని నిలువరించడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతిని కాపాడటానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అక్టోబర్ 24, 1945న ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. అక్టోబర్ 24ను ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది.
Russia-Ukraine War: స్టార్‌స్ట్రీక్ మిసైల్‌ను ఏ దేశంలో తయారు చేశారు?
రష్యాది నరమేధమే: బైడెన్
ఉక్రెయిన్‌లో రష్యా అకృత్యాలు ముమ్మాటికీ నరమేధమేనంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిప్పులు చెరిగారు. ఉక్రెయిన్‌ను సమూలంగా తుడిచిపెట్టేందుకే రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక దేశాన్ని గానీ జాతిని గానీ మతపరమైన సమూహాన్ని గానీ పూర్తిగా గానీ పాక్షికంగా గానీ ధ్వంసం చేయడాన్ని, అందుకు ప్రయత్నించడాన్ని నరమేధంగా ఐరాస ఒప్పందం నిర్వచిస్తోంది. సదరు ఒప్పందంలో అమెరికా కూడా భాగస్వామి. ఈ నేపథ్యంలో ఆ పదాన్ని వాడితే దాన్ని అడ్డుకోవడానికి అన్ని చర్యలూ తీసుకోవాల్సి ఉంటుంది.
కొనసాగుతున్న బాంబుల వర్షం
ఉక్రెయిన్ నగరాలపై రష్యా బాంబుల వర్షం కొనసాగుతూనే ఉంది. ఖర్కీవ్‌లో ఓ కలినరీ స్కూల్‌పై భారీ దాడి జరిగింది. బుచాలో 700 మందికి పైగా మరణించారని, 200 మంది దాకా ఆచూకీ లేకుండా పోయారని ఉక్రెయిన్ ప్రకటించింది. ఇప్పటిదాకా 403 మృతదేహాలను ఖననం చేసినట్టు చెప్పింది.
United Nations: ప్రపంచవ్యాప్తంగా ఏటా వృథా అవుతున్న ఆహారం విలువ?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్