Conference of the Parties: కాప్‌–26 శిఖరాగ్ర సదస్సుకు ఎవరు అధ్యక్షత వహించారు?

శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని యూకేలోని గ్లాస్గోలో జరిగిన భాగస్వామ్య పక్షాల (కాప్‌–26) శిఖరాగ్ర సదస్సు–2021 ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. వాతావరణ మార్పులు, వాటి దుష్ప్రభావాలు, వాటిని ఎదుర్కొనేందుకు అమలు చేయాల్సిన వ్యహాలపై చర్చించేందుకు జరిగిన ఈ సదస్సులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలపై ముసాయిదా తుది ప్రకటనను నిర్వాహకులు నవంబర్‌ 12న విడుదల చేశారు. అక్టోబర్‌ 31న ప్రారంభమై.. నవంబర్‌ 12 వరకు కొనసాగిన సదస్సుకు భారత సంతతి వ్యక్తి, బ్రిటన్‌ కేబినెట్‌ మంత్రి అలోక్‌ శర్మ అధ్యక్షత వహించారు. సదస్సులో ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 నుంచి 2 డిగ్రీల పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై ప్రదానంగా చర్చించారు.

బైడెన్‌–జిన్‌పింగ్‌ భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధినేత జీ పిన్‌పింగ్‌ నవంబర్‌ 15న సమావేశం కానున్నారు. వర్చువల్‌ విధానం ద్వారా ఈ భేటీ జరగనుంది.


చ‌ద‌వండి: ఐఎస్‌ఏ, యూఎన్‌ఎఫ్‌సీసీసీ మధ్య కుదిరిన ఒప్పంద ఉద్దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి : అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 12 వరకు కాప్‌ –26 సదస్సు(కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ 26వ సదస్సు–2021) నిర్వహణ
ఎప్పుడు : నవంబర్‌ 12 
ఎక్కడ : గ్లాస్గో, స్కాట్‌లాండ్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌
ఎందుకు : వాతావరణ మార్పులు, వాటి దుష్ప్రభావాలు, వాటిని ఎదుర్కొనేందుకు అమలు చేయాల్సిన వ్యహాలపై చర్చించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags