Visa: పర్యాటక రంగాన్ని పునరుద్ధరించేందుకు వీసా నిబంధనల్లో మార్పులు

పర్యాటక రంగాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో థాయ్‌లాండ్ ప్రభుత్వం సందర్శకుల వీసా వ్యవధిని పొడిగించింది.

ఈ కొత్త నిబంధనలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. పర్యాటకులు, విద్యార్థులు, రిమోట్ వర్కర్లకు వీసా పొందడం సులభతరం చేస్తాయి.

మార్పులు ఇవే..
ఆన్-అరైవల్ వీసా: 30 రోజుల నుంచి 60 రోజులకు పొడిగించబడింది.
విద్యార్థి వీసా: గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక సంవత్సరం పాటు ఉండటానికి అనుమతిస్తుంది.
రిమోట్ వర్కర్ వీసా: ఐదేళ్ల వ్యవధితో కొత్త వీసాను ప్రవేశపెట్టింది.
రిటైర్‌మెంట్ వీసా: బీమా అవసరాలను సడలించింది.
అర్హత ఉన్న దేశాల సంఖ్య: పర్యాటక వీసాలకు అర్హత ఉన్న దేశాల సంఖ్యను 57 నుంచి 93కి పెంచింది.

Blue Residency Visa: ప‌ర్యావ‌ర‌ణ హితుల‌కు యూఏఈ 'బ్ల్యూ' రెసిడెన్సీ విసాలు..

➤ 2024 చివరి నాటికి 40 మిలియన్ల మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించడం.
➤ 2019లో కరోనాకు ముందు ఉన్న రికార్డును అధిగమించడం.
➤ పర్యాట రంగం ద్వారా 3.5 ట్రిలియన్ భాట్లు (రూ.7.9 లక్షల కోట్లు) ఆదాయం పొందడం.

#Tags