North Korea: ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ.. వ్యతిరేకించిన దేశం ఇదే..

ఉత్తర కొరియాకు చెందిన‌ అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్యసమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది.

15 సభ్య దేశాల్లో 13 అనుకూలంగా ఓటు వేశాయి. కానీ రష్యా వ్యతిరేకించ‌గా, చైనా హాజరు కాలేదు. దీంతో కమిటీ పర్యవేక్షణ నిలిచిపోనుంది. ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై ఆంక్షలు మాత్రం కొనసాగుతాయి. ఉత్తర కొరియా నుంచి ఆయుధాలను తెచ్చుకుంటున్న రష్యా దానిని కొనసాగించడానికే తీర్మానాన్ని అడ్డుకుందని మిగిలిన దేశాలు ఆరోపించాయి.

Rain Tax: వర్షం కురిస్తే ట్యాక్స్ త‌ప్ప‌కుండా కట్టాల్సిందే..!

#Tags