Ghost Shark: కొత్త రకం చేపను కనుగొన్న శాస్త్రవేత్తలు

పసిఫిక్‌ మహాసముద్రంలో అత్యంత లోతుల్లో సంచరించే కొత్త రకం చేపను న్యూజిలాండ్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఈ చేప కళ్లు చాలా నల్లగా ఉండటంతోపాటు చిమ్మచీకటిమయమైన సముద్రం లోతుల్లో సంచరిస్తుండటంతో దీనిని ‘ఘోస్ట్‌ షార్క్‌’గా పేర్కొంటున్నారు. ఘోస్ట్‌ షార్క్‌లను స్పూక్‌ షిఫ్‌ లేదా చిమేరా అని కూడా అంటారు. వీటిలో ముళ్లులు, పొలుసులు ఉండవు. శరీరం మొత్తం మెత్తగా మృదులాస్థితోనే తయారై ఉంటుంది. 

వెల్లింగ్టన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ అట్మాస్ఫెరిక్ రీసెర్చ్ (NIWA)కి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ చేప జాతిని కనుగొంది. దీని ప్రకారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల లోతైన నీటిలో ఆస్ట్రేలేషియన్ నారో-నోస్డ్ స్పూక్‌ఫిష్ నివసిస్తున్నట్లు గుర్తించారు.

అలాగే.. ఈ చేపలు న్యూజిలాండ్‌కు తూర్పున ఉన్న ఛాథమ్‌ రైస్‌ అనే సముద్రజలాల ప్రాంతంలో జీవిస్తున్నాయి. అవి ఉపరితలం నుంచి ప్రత్యేకమైన పక్షి-రూప ముక్కుతో దాదాపు 2,600 మీటర్ల (8,530 అడుగుల) లోతులలో క్రస్టేషియన్‌లను తింటాయి.

మొత్తం పొడవులో సగం ఉండే పొడవాటి ముక్కు లాంటి నోరు వీటి ప్రత్యేకత. లాటిన్‌లో అవియా అంటే బామ్మ. అందుకే దీనిని హరియోటా అవియా అని పేరు పెట్టాం. అంతరించి పోతున్న జాతుల జాబితాలో చేర్చే విషయమై ఆలోచిస్తున్నట్టు నిపుణులు తెలిపారు.

Deepest Lakes: ప్రపంచంలోని లోతైన టాప్ 10 సరస్సులు ఇవే..

#Tags