Syria Earthquake: శిథిలాల కిందే చిన్నారికి జననం... కన్నబిడ్డను కనులారా చూడకుండానే...!

కన్ను మూస్తే మరణం... కనులు తెరిస్తే జననం... బట్‌ ఈ రెండు మన చేతుల్లో ఉండవు. కేవలం రెప్పపాటులోనే సంభవిస్తాయి అది జననమైనా.. మరణమైనా...

అలాగే పుట్టుక.. మరణం.. రెండూ రక్తంతో కూడుకున్నవే. ప్రకృతి ప్రకోపంతో కన్నెర జేస్తే ఫలితం ఎలా ఉంటుందో తాజా భూకంపాల(Earthquake)ను చూస్తే స్పష్టమవుతుంది. అయితే.. లయకారుడి తాండవంతో సృష్టి వినాశనానికి మాత్రమే కాదు చావుపుట్టుకలకి కూడా కారణమని ప్రతీతి. కష్టకాలంలోనూ వెలుగు రేఖను ప్రసరించే ప్రయత్నం చేశాడేమో ఆ భగవంతుడు!. శిథిలాల కిందే బిడ్డను ప్రసవించి కన్నుమూసిందో కన్నతల్లి. 
ఎటు చూసినా శ‌వాలే..!
మూగబోయిన సెల్‌ఫోన్లు(Cell Phones).. మంచు కురిసేంత చలికి వణికిపోతూ చేతికి దొరికిన పేపర్లను, అట్ట ముక్కలను, కవర్లను కాల్చుతూ చలి మంట కాచుకుంటున్నారు భూకంప బాధితులు.

టర్కీ(Turkey), సిరియా(Syria)లో ఎటు చూసినా భవనాల శిథిలాలు.. శవాల దిబ్బలను తలపిస్తున్నాయి. సోషల్‌ మీడియా(Social Media)లో ఎటు చూసినా భూకంపాలకు సంబంధించిన దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి. తమవంతుగా సహాయక చర్యల్లో స్థానికులు సైతం పాల్గొని.. ఎందరినో కాపాడుతున్నారు. 

చ‌ద‌వండి: టర్కీ, సిరియాలో భారీ భూకంపాలు.. 4,500 మందికి పైగా దుర్మరణం
చావు.. పుట్టుక .. దైవాదీనం
సిరియా అలెప్పోలో ఓ తల్లి బిడ్డను ప్రసవించింది. అదీ శిథిలాల కిందే!. దురదృష్టం కొద్దీ ప్రసవించిన వెంటనే ఆ తల్లి కన్నుమూసింది. శిథిలాల తొలగింపు క్రమంలో ఇది గమనించిన స్థానికులు.. ఆ బిడ్డను హుటాహుటిన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బిడ్డ పరిస్థితి నిలకబడగా ఉన్నట్లు తెలుస్తోంది. చావు.. పుట్టుక .. దైవాదీనం అనే విషయం ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

#Tags