Landslide: న్యూ గినియాలో తీవ్ర విషాదం.. కొండచరియల కారణంగా 2,000 మంది మృతి!!

పసిఫిక్‌ ద్వీప దేశం పపువా న్యూ గినియాలో కొండచరియలు విరిగిపడి యంబలి గ్రామాన్ని నేలమట్టం చేసింది.

ఈ ఘటనలో దాదాపు 2000 మంది సజీవ సమాధి అయ్యారని ఆ దేశ నేషనల్‌ డిజాస్టర్‌ సెంటర్‌ పేర్కొంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ఆఫీసుకు పాపువా న్యూ గినియా అధికారులు సమాచారం ఇచ్చారు.

వివరాల ప్రకారం.. పావువా న్యూ గినియాలో కొండ చరియలు విరగిపడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపు రెండు వేల మంది సజీవ సమాధి అయ్యారు. కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ బీభత్సం సంభవించింది. కొన్ని చోట్ల 8 మీటర్ల ఎత్తున శిథిలాలు కుప్పలుగా పడినట్టు సమాచారం. కాగా, చాలా చోట్ల ఇలా కొండచరియలు విరిగి పడుతుండటంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. పెద్ద సైజులో బండరాళ్లు ఉండటంతో మృతదేశాల వెలికితీత కష్టంగా మారింది.  

 

 

ఈ ప్రమాద ఘటన కారణంగా తమ దేశానికి తగు సాయం అందించాలని అక్కడి ప్రభుత్వం కోరింది. అలాగే.. మిత్రదేశాలు అందించే సాయాన్ని డిజాస్టర్‌ సెంటర్‌ ద్వారా సమన్వయం చేసుకొంటామని పేర్కొంది.

మట్టి, బండరాళ్లు, చెట్లు మూడు నుంచి నాలుగు ఫుట్‌బాల్‌ మైదానాలంత విస్తీర్ణంలో 6 నుంచి 8 మీటర్ల లోతున గ్రామాన్ని భూస్థాపితం చేశాయని, లోపల చిక్కుకున్న వారు బతికి బట్టకట్టేందుకు అవకాశాలు తక్కువని ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ మైగ్రేషన్‌(ఐవోఎం) తెలిపింది.

New Covid Wave: మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ వేవ్.. వారంలో 26 వేల కేసులు!!

#Tags