Kamala Harris: డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పేరు ఖరారైంది.

అధ్యక్ష అభ్యర్థికి కావాల్సిన 1,976 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ దేశ మీడియా సంస్థలు వెల్లడించాయి. పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా త్వరలోనే నామినేషన్‌ పొందుతా అని కమలా హారిస్‌ సైతం ప్రకటించారు. అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ పేరు అనధికారికంగా ఖరారు కావడంతో ఇప్పుడు ఉపాధ్యక్ష అభ్యర్థి పేరుపై చర్చ జరుగుతోంది. 

ఉపాధ్యక్ష రేసులో కెంటకీ గవర్నర్‌ ఆండీ బెషీర్, యుఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సెక్రటరీ పీట్‌ బుట్టిగీగ్, నార్త్‌ కరోలినా గవర్నర్‌ రాయ్‌ కూపర్, అరిజోనా సెనేటర్‌ మార్క్‌ కెల్లీ, పెన్సిల్వేనియా గవర్నర్‌ జోష్‌ షాపిరో, ఇల్లినాయిస్‌ గవర్నర్‌ జె.బి.ప్రిట్జ్‌కర్, మిచిగాన్‌ గవర్నర్‌ గ్రెట్చెన్‌ విట్మర్‌ ఉండొచ్చని భావిస్తున్నారు.

Donald Trump : రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌..
 
ఎన్నికలకు 106 రోజులు..
డెలావేర్‌లోని ప్రచార ప్రధాన కార్యాలయాన్ని హారిస్‌ సందర్శించారు. ఆమె జూలై 22వ తేదీ బైడెన్‌ ప్రచారం బృందంతో సమావేశమయ్యారు. ఈ టీమ్‌తోనే కలిసి పనిచేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా 106 రోజులే ఉన్నాయని, గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. తన రిపబ్లికన్‌ ప్రత్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌పై హారిస్‌ విరుచుకుపడ్డారు. ఆయన కుంభకోణాలను గుర్తు చేశారు. నేరాలను ఎత్తి చూపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తో కలిసి పనిచేయడం తనకు దక్కిన ఒక గొప్ప గౌరవమన్నారు. ఆయన అమెరికా ప్రజలకోసం నిరంతరం శ్రమించారని కొనియాడారు.

Nepal PM: నేపాల్ ప్రధానిగా.. ఓలి రెండేళ్లు, దేవ్‌బా ఒకటిన్నర సంవ‌త్స‌రం!

#Tags