Indian Students: కిర్గిజ్‌స్థాన్‌లో దాడులు.. భారతీయ విద్యార్థులు బయటకు రావద్దని హెచ్చరిక

కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్‌లో విదేశీ విద్యార్థులపై హింసాత్మక ఘటనలు(మూక దాడులు) జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర‌ ప్రభుత్వం అక్కడుంటున్న భార‌తీయ విద్యార్థులను అప్రమత్తం చేసింది. ఎవరూ బయటకు రావొద్దని.. ఇంటి లోపలే ఉండమ‌ని సలహా ఇచ్చింది. 

Student Visa Rules: ఇక్క‌డ చదువుకోవాలనుకునే విద్యార్థుల వీసాకు కొత్త రూల్ ఇదే..

ఈ దాడిలో పలువురు పాకిస్థాన్ విద్యార్థులు గాయపడ్డారు. వారు ఉండే ద‌గ్గ‌రే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థుల భద్రతపై భారత ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీంతో భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ఇక్క‌డ ఉన్న‌ పోస్టును పెట్టింది.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా విద్యార్థులు రాయబార కార్యాలయానికి ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు.

 

 

#Tags