Vasuki Indicus: ప్రపంచంలోనే అతిపెద్ద పాము వెలుగులోకి.. ఇది ఉన్న‌ది ఎక్క‌డో తెలుసా?!

శిలాజాలను గుర్తించిన శాస్త్రవేత్తలు ఏకంగా 50 అడుగుల పొడవు.. టన్నుకుపైగా బరువు.. 4.7 కోట్ల ఏళ్ల కింద జీవించినట్టుగా అంచనా.

భూమ్మీద అతిపెద్ద సర్పం ఏదంటే.. ఏం చెప్తారు?.. సింపుల్‌గా అనకొండ అంటారు కదా. కానీ వాటికన్నా అతి పెద్ద సర్పం మన దేశంలో తిరుగాడిందని శాస్త్రవేత్తలు తేల్చారు. గుజరాత్‌లోని ఓ గనిలో దానికి సంబంధించిన శిలాజాలను గుర్తించారు. 50 అడుగులకుపైగా పొడవుతో, ఏకంగా టన్నుకుపైగా బరువుతో ఉంటుందని అంచనా వేసిన ఈ సర్పానికి ‘వాసుకి’ అని పేరు పెట్టారు. హిందూ పురాణాల ప్రకారం దేవదేవుడైన శివుడి మెడలో ఉండే సర్పమే వాసుకి.

మొసలి కావొచ్చనుకుని..
2005లో గుజరాత్‌లోని ఓ బొగ్గు గనిలో తవ్వకాలు జరు­పు­తుండగా కొన్ని శిలాజాలను గుర్తించారు. వాటిని సేకరించిన శాస్త్ర­వే­త్తలు పురాతన కాలం నాటి భారీ మొసలి వంటి జీవి వెన్ను­పూసలు కావొ­చ్చని ప్రాథమికంగా భావించారు. తర్వాత ఈ విష­యం మరుగున పడింది. తిరిగి కొన్నేళ్ల క్రితం వీటిపై రూర్కీ ఐఐటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. గనిలో లభించిన మొత్తం 27 వెన్నుపూసలను క్రమ పద్ధతిలో చేర్చారు. వాటిలో కొన్ని ఒకదానికొకటి అనుసంధానమై ఉండటాన్ని గమనించారు. వివిధ జీవుల వెన్నుపూసలతో ఈ శిలాజ ఎముకలను పోల్చి చూశారు.

అతిపెద్ద పాముగా తేల్చి..
ఈ వెన్నుపూసల శిలాజాలు ఓ భారీ సర్పానికి సంబంధించినవి కావొచ్చని గత ఏడాదే ఓ అంచనాకు వచ్చారు. పూర్తి స్థాయి­లో పరిశీలన జరిపి.. భా­రీ సర్పమేనని నిర్ధారించా­రు. ఆ వెన్నుపూసల సైజు, స్థితి­గతు­లు, దొరికిన ప్రాంతం, ఇతర ఆధా­రా­లను బట్టి.. స­ర్పం పరిమా­ణం, అది జీవించిన తీరు, దాని ఆహారమే­మి­టన్న అంచనాలు వేశారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సర్ప­మ­ని తేల్చారు. దానికి శివుడి మెడలో ఉండే సర్పం పేరిట ‘వాసుకి ఇండికస్‌’ అని పేరు పెట్టారు.

Ram Lalla Silver Coin: అయోధ్య రాముడి వెండి నాణెం విడుదల.. ధర ఎంతంటే..

4.7 కోట్ల ఏళ్ల కింద..
వాసుకి 50 అడుగులు (15 మీటర్లు) పొడవుతో.. టన్నుకుపైగా బరువుతో ఉంటుందని అంచనా వేశారు. సుమారు 4.7 కోట్ల ఏళ్ల కింద ఈ సర్పం జీవించిందని తేల్చారు. దీని భారీతనం కారణంగా మెల్లగా కదిలేదని, దానికి చిక్కిన జంతువులను గట్టిగా చుట్టేసి తినేసేదని గుర్తించారు. ప్రస్తుతం భూమ్మీద జీవించి ఉన్న వాటిలో అనకొండలు, పైథా­న్‌లు అతి పెద్దవి. అంతరించిపోయిన వా­టి­లో కొలంబియాలో గుర్తించిన టిట­నోబోవా అతి పెద్దది. దాని ఎముకల శిలాజాలను బట్టి.. 42.7 అడుగుల (13 మీటర్లు) పొడవుతో, 1,100 కిలోలకు­పైగా బరువు­తో ఉండి ఉంటుందని అంచనా వేశారు. చేపలు, తాబేళ్లు, మొసళ్లు, వేల్స్‌ను తినేదని అంచనా వేశారు.

నాటి పరిస్థితులతోనే భారీ ఆకారం
‘ఆ కాలం నాటి వాతావరణం, అందుబాటులో ఉన్న ఆహారం, శత్రు జీవులు లేకపోవడం, నాటి వేడి వాతావరణం వల్ల వాసుకి సర్పం ఇంత భారీగా ఎదిగి ఉంటుందని భావిస్తున్నాం. ఇది అనకొండ తరహాలోనే నీటిలో కంటే నేల మీదే జీవించి ఉండటానికి అవకాశం ఎక్కువ. భారీగా ఉండటం వల్ల చెట్లపైకి ఎ­క్కగలిగి ఉండేది కాదు. ఇది కచ్చితంగా టిటనోబోవా కంటే పెద్దది. భూమ్మీద జీ­వించిన సర్పాలన్నింటికంటే పెద్దదని చెప్పవచ్చు’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన రూర్కీ ఐఐటీ శాస్త్రవేత్తలు దేవజిత్‌ దత్తా, సునీల్‌ వాజ్‌పాయ్‌ తెలిపారు. 

Library Village: దేశంలో లైబ్రరీ విలేజ్‌ ఎక్కడుందో తెలుసా.. ఈ పేరెలా వచ్చిందంటే..!

#Tags