Dark Oxygen : సముద్రం అట్టడుగున డార్క్‌ ఆక్సిజన్‌..

సముద్రం అట్టడుగున డార్క్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి కావటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాదాపు 13 వేల అడుగుల లోతున ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ను డార్క్‌ ఆక్సిజన్‌ అంటారు. ఎలాంటి జీవి ప్రమేయం లేకుండా.. సూర్యరశ్మి పడకుండా పసిఫిక్‌ మహా సముద్రంలో ప్రాణవాయువు ఉత్పత్తి కావటమే అందుకు కారణం.

World's Most Powerful Passports : అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితా విడుద‌ల‌.. తొలి స్థానంలో సింగాపూర్‌!

దీన్ని బట్టి సముద్రపు అడుగు భాగంలో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయొచ్చన్న అభిప్రాయం బలపడుతోందని స్కాటిష్‌ అసోసియేషన్‌ ఫర్‌ మెరైన్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2013లోనే తొలిసారిగా దీన్ని గుర్తించగా.. పూర్తి అధ్యయనం తర్వాత ఈ అంశాన్ని ఓ జర్నల్‌లో ప్రచురించారు.

#Tags