Three Gorges Dam: భూ గమనాన్ని ప్రభావితం చేస్తున్న చైనా 'త్రీ గోర్జెస్‌ డ్యామ్‌'

చైనాలోని యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీ గోర్జెస్‌ డ్యామ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుల్లో ఒకటి.

ఇది విద్యుత్ ఉత్పత్తి, వరద నియంత్రణ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే.. ఈ భారీ ప్రాజెక్టు భూ గమనాన్ని ప్రభావితం చేసే ప్రమాదమున్నదని ఐఎఫ్‌ఎల్‌ సైన్స్‌ వెబ్‌సైట్ పేర్కొంది.

భారీ నీటి నిల్వ: ఈ డ్యామ్‌లో సుమారు 10 లక్షల కోట్ల గ్యాలన్ల నీరు నిల్వ ఉంటుంది. ఇంతటి భారీ నీటి సముద్రం భూమి పై భూగమనానికి ప్రభావం చూపే పరిస్థితులు సృష్టిస్తుంది.

భూకంపాలకు అనుసంధానం: 2004లో హిందూ మహాసముద్రంలో జరిగిన భూకంపం సమయంలో సముద్రానికి వచ్చి చేరిన నీటి మూలంగా భూగమన వేగం తగ్గిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పేర్కొంది. ఆ సమయంలో.. రోజుకు 2.68 మైక్రోసెకన్లు తగ్గినట్టు గణన చేసినట్టు సమాచారం.

త్రీ గోర్జెస్ డ్యామ్: ఈ డ్యామ్ వల్ల భూగమన వేగం 0.06 మైక్రోసెకండ్లు తగ్గవచ్చని, సూర్యుడి నుంచి భూమి దూరం 2 సెంటీమీటర్ల మేర పెరిగే అవకాశం ఉందని ఐఎఫ్‌ఎల్‌ సైన్స్‌ నివేదికలో తెలియజేసింది.

Cyclones: ఆయాదేశాల‌తో సంబంధం ఉన్న తుఫాన్ల పేర్లు ఇవే..

#Tags