Turkish Drones: భారత్‌తో సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌ కిల్లర్‌ డ్రోన్లు

భారత్‌తో సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌ డ్రోన్లను మోహరించింది.

టర్కీలో తయారైన అధునాతన బేరక్తార్ టీబీ2 డ్రోన్లను పశ్చిమబెంగాల్‌లోని సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌ మోహరించింది. దాంతో భారత్‌ అప్రమత్తమైంది. షేక్‌ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత సరిహద్దుల్లో తీవ్రవాద కార్యకలాపాలు ఉధృతమయ్యాయనే వార్తల నేపథ్యంలో భారత్‌ నిఘాను మరింత పెంచింది. 

బేరక్తార్‌ టీబీ2 డ్రోన్ల మోహరింపునకు సంబంధించి భారత ఆర్మీ వాస్తవాలను బేరీజు వేస్తోంది. బంగ్లాదేశ్‌ ఇంటలిజెన్స్, సర్వైలెన్స్‌ 67 విభాగం ఈ డ్రోన్లను పర్యవేక్షిస్తోంది. రక్షణ చర్యల్లో భాగంగా ఈ డ్రోన్లను రంగంలోకి దింపామని బంగ్లా చెబుతున్నా పశ్చిమబెంగాల్‌తో వ్యూహాత్మకమైన సరిహద్దు ప్రదేశాల్లో వీటిని మోహరించడంపై భారత్‌ అప్రమత్తమైంది. హసీనా ప్రభుత్వ పతనం తర్వాత సరిహద్దుల్లో తీవ్రవాద కార్యకలాపాలు ఊపందుకున్నాయని, చొరబాటు ప్రయత్నాలు పెరిగాయనే వార్తలు వ‌స్తున్నాయి.

Gold Deposit Found: ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు పంట.. విలువ రూ.7 లక్షల కోట్ల పైనే.. ఎక్కడ బయటపడిందంటే?

#Tags