Earthquake: రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

రష్యాలో స్థానిక కాలమానం ప్రకారం ఆగ‌స్టు 18వ తేదీ భూకంపం సంభవించింది.

రిక్ట్కర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. భూకంప కేంద్రం తూర్పు కంచట్కా ద్వీపకల్ప తీరంలో ఉందని వెల్లడయ్యింది. ఈ భూకంపం దరిమిలా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. 

రష్యాలోని కంచట్కా తూర్పుతీర ప్రాంతానికి చేరువగా సంభవించిన భూకంపం అనంతరం ఓ అగ్ని పర్వతం కూడా బద్దలు కావ‌డంతో.. దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వరకు ఇది లావా వెదజల్లుతోంది.

భూకంపం అంటే భూమిలోని క్రస్ట్‌ పొరలో అకస్మాత్తుగా విడుదలయ్యే ఒత్తిడి శక్తి. దీని ఫలితంగా భూమి లోపలి నుంచి బయటకు ప్రకంపనలు పుట్టించే తరంగాలు విడుదలవుతాయి. క్రస్ట్‌లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతి పొర వరకు మాత్రమే వస్తాయి. అయితే రాతి పొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు అది బలహీన ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఫలితంగా భూకంపాలు ఏర్పడుతాయి. అయితే భూకంప తీవ్రత అధికంగా ఉంటే దాని ప్రకంపనలు చాలా దూరం వరకూ విస్తరిస్తాయి.

NISAR Mission: హిమాలయాల భూకంప మండలాలను అన్వేషించే ప్రయత్నం!

#Tags