Teachers Day: సెప్టెంబ‌ర్ 5వ తేదీ ఉపాధ్యాయ‌ దినోత్స‌వం

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఇది డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకొని నిర్వహించబడుతుంది. రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5వ తేదీ తమిళనాడులో జన్మించారు. 1952 నుంచి 1962 వరకు భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962 నుంచి 1967 వరకు రెండవ రాష్ట్రపతిగా సేవలందించారు. 

1962లో ఆయన భారతదేశపు రెండవ రాష్ట్రపతిగా నియమితులయ్యాక, ఉపాధ్యాయుల దినోత్సవం ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ ఈ దినోత్స‌వాన్ని జరుపుకుంటున్నారు. ఈ రోజున ఉపాధ్యాయుల సమాజానికి చేసిన అమూల్యమైన కృషిని గుర్తించడం జరుగుతుంది.

ఉపాధ్యాయుల దినోత్సవం.. ఉపాధ్యాయులు, విద్యార్థుల దృష్టిలో చాలా ముఖ్యమైన రోజు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ రోజును ఎంతో ఆశతో ఎదురుచూస్తారు. ఉపాధ్యాయుల పాత్రను మరింతగా గుర్తించడానికి ఇది సహాయపడుతుంది. విద్యార్థులు తమ కృతజ్ఞతలను చెలామణి చేయడం, సంబరాలు, చిన్న చిన్న సత్కారాలను అందించడం ద్వారా ఉపాధ్యాయులపై వారి ప్రభావాన్ని గుర్తిస్తారు.

National Awards: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోనున్న 16 మంది వీరే..
 
భారతదేశంలోని ప్రతి విద్యా సంస్థలో ఉపాధ్యాయుల దినోత్సవం జరుపబడుతుంది. ప్ర‌తి సంవత్సరం భారత ప్రభుత్వం 'నేషనల్ టీచర్ అవార్డ్స్'ను ప్రవేశపెడుతుంది. 

#Tags