Jagananna Thodu: చిరు వ్యాపారులకు జగనన్న తోడు

 చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’ పథకంలో భాగంగా వరుసగా నాలుగో ఏడాది 5,10,412 మంది చిరు వ్యాపారులకు రూ.549.70 కోట్ల వడ్డీలేని రుణాలతో పాటు రుణాలపై కిస్తీలను సకాలంలో చెల్లించిన వారికి రూ.11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను మొత్తం రూ.560.73 కోట్లను సీఎం జగన్‌ మంగళవారం బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు.
Jagananna Thodu

‘జగనన్న తోడు’ పథకం ద్వారా తాజా లబ్ధిదారులతో కలిపితే ఇప్ప­టి­వరకు 15,87,000 మంది చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూ­రుస్తూ వడ్డీ లేని రుణం కింద రూ.2,955.79 కోట్లు ఇవ్వగలిగామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.
జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధి పొందిన 15.87 లక్షల మందిలో 80 శాతం మంది అక్కచెల్లెమ్మలే ఉన్నారు.పథకం ద్వారా సున్నా వడ్డీ కింద మరో రూ.74.69 కోట్లు చెల్లించి వారికి మేలు చేసినట్లు సీఎం జగన్‌ చెప్పారు.
☛☛ NITI Aayog ‘National Multidimensional Poverty Index': ఏపీలో త‌గ్గిన పేద‌రికం..

#Tags