BR Ambedkar: ఆకాశమంత అంబేడ్కరుడు.. విగ్రహం విశేషాలు ఇవే

హుస్సేన్‌ సాగర్‌ తీరాన సగర్వంగా కొలువైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా పేరు దక్కించుకుంది. ఈ విగ్రహాన్ని రాష్ట్ర సెక్రటేరియట్ పక్కన, బుద్ధ విగ్రహానికి సమీపంలో తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం పక్కన ఏర్పాటు చేశారు. అంబేడ్కర్‌ 132వ జయంతి సందర్భంగా నేడు సీఎం కేసీఆర్‌ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
BR Ambedkar

- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అంబేడ్కర్‌ విగ్రహాం నిర్మాణాన్ని చేపట్టింది. భారీ ఎత్తున రూపొందిన ఈ విగ్రహం బరువు 465 టన్నులు. దీని కోసం 96 టన్నుల ఇత్తడిని ఉపయోగించారు. ఎత్తు 125 అడుగులు, వెడల్పు 45.5 అడుగులు. విగ్రహం ఢిల్లీలో తయారు చేసి విడి భాగాలుగా తెచ్చి హైదరాబాద్‌లో అమర్చారు. పార్లమెంటు ఆకారంలో నిర్మించిన పీఠం లోపల సందర్శనాలయం ఉంటుంది. 

చ‌ద‌వండి: భారీగా గురుకుల పోస్టుల భర్తీ.. దరఖాస్తు విధానం ఇదే!
- విగ్రహం ఖర్చు రూ.146 కోట్లు. ఈ ప్రాజెక్టులో మొత్తం 791 టన్నుల స్టీల్ వాడారు. విగ్రహం తయారీ కోసం 425 మంది శ్రామికులు పని చేశారు. ఇందులో 2 లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. ( ఒక్కోదానిలో 15 మంది సామర్థ్యం)


- విగ్రహం ఏర్పాటు కోసం 11.7 ఎకరాలు, ప్రధాన, అనుబంధ భవనాలు కోసం 1.35 ఎకరాలు, చుట్టు పచ్చదనం కోసం  2.93 ఎకరాలు, చుట్టూ అభివృద్ధి చేసిన ప్రాంతం కోసం 1.23 ఎకరాలు, కామన్‌ పార్కింగ్‌ కొరకు  4.82 ఎకరాలను కేటాయించారు.
- ఈ విగ్రహం ఉన్న పీఠం ఎత్తు 50 అడుగులు, మొత్తం ఎత్తు 175 అడుగులు.

చ‌ద‌వండి: ప‌ది, ఐటీఐ, డిప్లొమా అర్హ‌త‌తో కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలు... పూర్తి వివ‌రాలు ఇవే
- 11.04 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. అందులో 2.93 ఎకరాల్లో థీమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. 
- అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి సాంకేతిక, తయారీ చర్యలను ఖరారు చేసేందుకు రెండేళ్లు పట్టింది.
- ఈ కార్యక్రమానికి పద్మభూషణ్ అవార్డు గ్రహీత, విగ్రహ శిల్పి 98 ఏళ్ల రామ్ వంజీ సుతార్‌ను ఆహ్వానించారు.

#Tags