Union Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం.. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆమోదం

కేంద్ర క్యాబినెట్‌ ఇటీవల పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆమోదం ప్రకటించింది.

ఇవి దేశంలోని వివిధ రంగాల్లో అభివృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. వీటి గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు.

పాన్ 2.0..
పాన్ కార్డు ఆధునికీకరణ కోసం పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు ఆమోదం ఇచ్చింది. దీని ద్వారా పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ మరియు సంబంధిత సేవలను సాంకేతికంగా మరింత సులభతరం చేయడం, వేగవంతం చేయడం, సురక్షితంగా చేయడం లక్ష్యం.

అటల్ ఇన్నోవేషన్ మిషన్
అటల్ ఇన్నోవేషన్ మిషన్ కోసం రూ.2750 కోట్లను కేటాయించారు. ఈ మిషన్ ద్వారా దేశంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, వ్యాపారాలు, పరిశోధనలకు మరింత ప్రోత్సాహం కల్పించేందుకు చర్యలు తీసుకోబడతాయి.

PAN 2.0 Project: పాన్ 2.0 ప్రాజెక్ట్‌.. క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్ కార్డులు

ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్
ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్‌కు రూ.2481 కోట్ల బడ్జెట్‌ను ఆమోదం తెలిపింది. ఈ పథకం ప్రకృతి అనుకూల వ్యవసాయ విధానాలను ప్రోత్సహించేందుకు, వ్యవసాయ రంగంలో పర్యావరణంపై అవగాహన పెంచేందుకు పని చేస్తుంది.

అరుణాచల్ ప్రదేశ్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టులు
అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులుకు రూ.3,689 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో శక్తి ఉత్పత్తి పెంచి, ఆర్థిక అభివృద్ధి కోసం అవసరమైన మౌలిక వసతులను అందించనున్నాయి.

వన్ నేషన్-వన్ సబ్‌స్క్రిప్షన్ పథకం 
విద్యార్థుల కోసం వన్ నేషన్-వన్ సబ్‌స్క్రిప్షన్ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం రూ.6,000 కోట్లను కేటాయించనున్నారు. ఈ పథకం ద్వారా ప్రముఖ యూనివర్సిటీల జర్నల్స్‌, పరిశోధనా పత్రాలు అందుబాటులో ఉంటాయి. దీని ద్వారా విద్యార్థులు శాస్త్రీయ, విద్యా సంబంధిత సమాచారం సులభంగా పొందగలుగుతారు.

New Fish Species: మూడు కొత్త ర‌కం చేపలను క‌నుగొన్న శాస్త్రవేత్తలు.. ఇవి క‌నిపించేది ఈ రాష్ట్రాల్లోనే..

#Tags