Physics Wallah: యూనికార్న్ జాబితాలో ఫిజిక్స్‌వాలా
Physics Wallah Became India's 101st Unicorn: ఎడ్‌టెక్ కంపెనీ ఫిజిక్స్‌వాలా యూనికార్న్ జాబితాలో చేరింది. సిరీస్–ఏ కింద కంపెనీ రూ.777 కోట్ల నిధులను సమీకరించింది. వెస్ట్‌బ్రిడ్జ్, జీఎస్‌వీ వెంచర్స్ ఈ మొత్తాన్ని సమకూర్చాయి. డీల్‌లో భాగంగా ఫిజిక్స్‌వాలాను రూ.8,663 కోట్లుగా విలువ కట్టారు. దీంతో భారత్‌లో 101వ యూనికార్న్‌గా ఫిజిక్స్‌వాలా చోటు సంపాదించింది. అలాగే సిరీస్–ఏ ఫండ్ ద్వారా ఈ ఘనతను సాధించిన మొదటి సంస్థ కూడా ఇదే. సంస్థ యాప్‌ను 52 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. యూట్యూబ్‌లో 69 లక్షల మంది చందాదార్లు ఉన్నారు. వృద్ధి ప్రయాణంలో భాగంగా తెలుగుసహా కొత్తగా తొమ్మిది స్థానిక భాషల్లో కంటెంట్‌ను పరిచయం చేయనున్నట్టు జూన్ 7న ఫిజిక్స్‌వాలా వెల్లడించింది. ఒక స్టార్టప్ విలువ ఒక బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరితే దానిని యూనికార్న్ స్టార్టప్ అంటారు.
World Economic Forum: డబ్ల్యూఈఎఫ్ టెక్‌లో చేరిన భారత స్టార్టప్‌లు?
RBI MPC Highlights: కీలక పాలసీ వడ్డీ రేటు అయిన రెపో రేటును ఎంత శాతం పెంచారు?
Zero Defect Zero Effect: జెడ్‌ఈడీ సర్టిఫికేషన్ స్కీమ్ ప్రధాన లక్ష్యం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌లో 101వ యూనికార్న్‌గా చోటు సంపాదించిన కంపెనీ?
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : ఫిజిక్స్‌వాలా
ఎందుకు : సిరీస్–ఏ కింద కంపెనీ రూ.777 కోట్ల నిధులను సమీకరించడంతో..
GK Economy Quiz: ఎయిర్‌ఏషియా ఇండియాను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించిన ఎయిర్‌లైన్ ఏది?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
GK Sports Quiz: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏ నగరంలో ప్రారంభించారు?