Investments in India:పెట్టుబడులలో చైనాను దాటిన భారత్‌

పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా భారతదేశం చైనాను అధిగమించింది.
Investments in India:పెట్టుబడులలో చైనాను దాటిన భారత్‌

దాదాపు 21 ట్రిలియన్‌ డాలర్ల అసెట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 85 సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌లు, 57 సెంట్రల్‌ బ్యాంకులు, 142 చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్ల అభిప్రాయాల ప్రాతిపదికన ప్రపంచ పెట్టుబడి నిర్వహణ సంస్థ ఇన్వెస్కో వెల్లడించిన ఒక నివేదిక ఈ విషయాన్ని తెలిపించింది. ‘‘ఇన్వెస్కో గ్లోబల్‌ సావరిన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీ’’ పేరుతో వెలువడిన ఈ నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..

➤ భారతదేశలో మెరుగైన వ్యాపార పరిస్థితులు, రాజకీయ స్థిరత్వం, అనుకూలమైన జనాభా, నియంత్రణ పరమైన సానుకూలతలు అంతర్జాతీయ పెట్టుబడిదారులు, సంస్థలు, ఫండ్స్‌కు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తున్నాయి.

➤ దేశీయ, అంతర్జాతీయ డిమాండ్‌ రెండింటినీ లక్ష్యంగా చేసుకుని పెరిగిన విదేశీ కార్పొరేట్‌ పెట్టుబడుల వల్ల ప్రయోజనం పొందుతున్న మెక్సికో, బ్రెజిల్‌తో సహా అనేక దేశాలలో భారతదేశం ఒకటిగా ఉంటోంది.

➤ పెట్టుబడులను పెంచడానికి ఆకర్షణీయమైన వర్ధమాన మార్కెట్‌లలో ప్రస్తుతం భారత్, దక్షిణ కొరియాలు ఉన్నాయి.

☛☛ Mancherial District Geographical Features: మంచిర్యాల జిల్లా భౌగోళిక విశేషాలు..

#Tags