100 Metric Tonnes: భారత్‌కు 100 టన్నుల బంగారం.. ఎక్క‌డి నుంచి అంటే..

భారతదేశ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) చారిత్రక నిర్ణయం తీసుకుంది.

బ్రిటన్‌ వాల్ట్‌లలో భద్రపర్చిన 100 టన్నుల బంగారాన్ని దేశీయ ఖజానాకు తరలించింది.

1991లో భారత్ విదేశీ మారక సంక్షోభాన్ని అధిగమించడానికి పసిడిని తాకట్టు పెట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున బంగారాన్ని తిరిగి తెచ్చుకోవడం ఇదే మొదటిసారి. బ్రిటన్‌ నుంచి బంగారం తరలింపు విషయంలో ఆర్థిక శాఖ, ఆర్‌బీఐ, ఇతరత్రా ఏజెన్సీలు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు, అత్యంత విలువైన లావాదేవీ కావడంతో చాలా గోప్యత పాటించినట్లు వివరించాయి.

రవాణా సౌలభ్యం తదితర అంశాలు పసిడి తరలింపునకు కారణమని పేర్కొన్నాయి. ప్రస్తుతం దేశీయంగా ముంబై, నాగ్‌పూర్‌లో పటిష్టమైన వాల్టుల్లో బంగారాన్ని నిల్వ చేస్తున్నారు. తాజా పరిణామంతో దేశీయంగా భద్రపర్చిన మొత్తం పసిడి పరిమాణం 408 టన్నులకు చేరింది.

అధికారిక గణాంకాల ప్రకారం 2024 మార్చి ఆఖరు నాటికి భారత్‌ వద్ద మొత్తం 822 టన్నుల బంగారం ఉంది. ఇందులో సుమారు 413.79 టన్నులు విదేశీ వాల్టుల్లో ఉన్నాయి. గత కొన్నాళ్లుగా గణనీయంగా పసిడి కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో విదేశాల్లో దాన్ని నిల్వ చేయడాన్ని తగ్గించుకోవాలని భారత్‌ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.   

Reserve Bank of India: ఈ బ్యాంక్‌లకు భారీ జరిమానా విధించిన ఆర్‌బీఐ!

#Tags