Exports Rise: భారత్‌ వస్తు ఎగుమతులు రికార్డ్..

భారత్‌ వస్తు ఎగుమతులు ఫిబ్రవరిలో రికార్డు సృష్టించాయి.

11 నెలల గరిష్ట స్థాయిలో 41.40 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2023 ఏప్రిల్‌తో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో ఎగుమతుల వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. ఇంజనీరింగ్‌ గూడ్స్, ఎలక్ట్రానిక్, ఫార్మా ఎగుమతులు పెరగడం మొత్తం సానుకూల గణాంకాలకు దారితీసింది. ఇక ఇదే కాలంలో దిగుమతులు 12.16 శాతం పెరిగి 60.11 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 18.70 బిలియన్‌ డాలర్లు.

► పసిడి దిగుమతులు ఫిబ్రవరిలో గణనీయంగా 133.82% పెరిగి, 6.15 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో 39% పెరిగి 44 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.
► ఇంజనీరింగ్‌ గూడ్స్‌ ఎగుమతులు ఫిబ్రవరిలో 15.9 శాతం పెరిగి 9.94 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ ఎగుమతులు 55 శాతం ఎగసి 3 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి.  
► 2023 ఏప్రిల్‌ నుంచి 2024 ఫిబ్రవరి వరకూ ఎగుమతుల (వస్తువులు, సేవలు) విలువ 0.83 శాతం వృద్ధితో 709.81 బిలియన్‌ డాలర్లు. ఇదే కాలంలో దిగుమతుల విలువ 782.05 బిలియన్‌ డాలర్లు.  
► 2021–22లో ఎగుమతుల విలువ 422 బిలియన్‌ డాలర్లయితే, దిగుమతుల విలువ 613 బిలియన్‌ డాలర్లు. 2022–23లో వస్తు ఎగుమతులు 450 బిలియన్‌ డాలర్లు. దిగుమతులు 714 బిలియన్‌ డాలర్లు. 

RBI: ఆర్‌బీఐ ఉద్గమ్‌ పోర్టల్‌లోకి 30 బ్యాంకులు

#Tags