RBI: లైసెన్స్ రద్దు చేసిన ఆర్‌బీఐ.. కనుమరుగు కానున్న 17 బ్యాంకులు..!

2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏకంగా 17 బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసింది.

ఆర్‌‌బీఐ ఒకే సంవత్సరంలోనే ఇన్ని బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడం గత 9 ఏళ్లలో ఇదే మొదటిసారి.  

బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద రూల్స్ అతిక్రమించిన బ్యాంకుల లైసెన్సులను ఆర్‌బీఐ క్యాన్సిల్ చేసింది. ఇందులో లక్నో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్, శ్రీ శారదా మహిళా కో-ఆపరేటీవ్‌ బ్యాంక్‌, హరిహరేశ్వర్ సహకార బ్యాంక్‌ మొదలైనవి ఉన్నాయి.

ఆర్‌బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన 17 బ్యాంకులలో 6 అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులే ఉన్నాయి. ఈ బ్యాంకులు గ్రామీణ బ్యాంకుల కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ, పనితీరు విషయంలో అంత ఆశాజనకంగా లేకపోవడం వల్ల ఆర్‌బీఐ కఠిన నిర్ణయాలు తీసుకొని వీటి లైసెన్స్ రద్దుచేసింది.

2022లో 12 సహకార బ్యాంకులు లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్‌బీఐ, 2023లో 17 బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది. 2014 తర్వాత మొత్తం 60 సహకార బ్యాంకులు కనుమరుగైనట్లు సమాచారం. ఇందులో అర్బన్, రూరల్ బ్యాంకులు రెండూ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే బ్యాంకుల పనితీరు సరిగ్గా లేకపోతే ఆ బ్యాంకులు కాలంలో కలిసిపోతాయని తెలుస్తోంది. 

▶ 2026 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న‌ భారత్‌

ఆర్‌బీఐ.. బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు గత ఏడాది లెక్కకు మించిన బ్యాంకులకు భారీ జరిమానాలు కూడా విధించింది. ఇందులో కేవలం ప్రైవేట్ బ్యాంకులు మాత్రమే కాకుండా, ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే నియమాలను అతిక్రమించిన ఏ బ్యాంకుకైనా పనిష్మెంట్ తప్పదని స్పష్టంగా తెలుస్తోంది.

చిన్న బ్యాంకుల్లో పొదుపు చేయకపోవడం ఉత్తమం..!
ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బు చిన్న చిన్న బ్యాంకుల్లో కాకుండా పెద్ద బ్యాంకులలో దాచుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. చిన్న బ్యాంకుల్లో ఎక్కువ మొత్తం దాచుకుంటే, అలాంటి బ్యాంకుల పనితీరు సరిగ్గా లేనప్పుడు ఆర్‌బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే.. ఆ భారం సదరు వినియోగదారుడు కూడా భరించాల్సి ఉంటుంది.

Permanently Ditch Dollar: అగ్రరాజ్యం అమెరికాకు భారీ షాక్‌.. కనుమరుగవుతున్న డాలర్.. కార‌ణం ఇదే..!

#Tags