World Paper Bag Day: ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో భాగంగా ప్లాస్టిక్ కవర్లకు బదులు, కాగితపు సంచులను వినియోగించండి, ప్రకృతి పరిరక్షణలో భాగంగా మీ వంతు బాధ్యతను నెరవేర్చండి.
World Paper Bag Day

మనం వాడే పలుచని ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు పర్యావరణానికి చాలా హానికరం. ఇవి నీరు, భూమి, వాయు కాలుష్యానికి దోహదకారిగా పనిచేస్తున్నాయి. ప్రతిరోజు ఇంట్లో వాడే చెత్త, చెదారం, తిని మిగిలిపోయిన పదార్థాలు ప్లాస్టిక్‌ సంచుల్లో మూటగట్టి పారవేస్తుంటాము. దీనివల్ల మురికి కాలువల్లో చెత్త పేరుకుపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
మూగజీవులు తమ ఆకలి తీర్చుకొనేందుకు మూటగట్టిన ప్లాస్టిక్‌ సంచులను తినడం వల్ల వాటి జీర్ణకోశం చెడిపోయి మరణిస్తున్నాయి. ఈ ప్లాస్టిక్‌ సంచులు భూమిలోనే స్థిరంగా ఉండటం వల్ల భూ కాలుష్యం పెరుగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సెకన్‌కు 1,60,000 ప్లాస్టిక్‌ సంచులు వినియోగించబడుతున్నాయి.వీటికి బదులు కాగితపు సంచులు వినియోగించాలి. ఇవి చాలా తక్కువ వ్యవధిలో భూమిలో కలిసిపోతాయి. కాగితపు సంచులను రీసైకిలింగ్‌ ద్వారా పునర్వినియోగించవచ్చు. 
పేపర్‌ బ్యాగులు కంపోస్ట్‌ చేసేందుకు పనికివస్తాయి.పేపర్‌ బ్యాగులు ఏ మాత్రం హానికరం కావు. గతంలో వలె కాగితం అంటే అటవీ సంపద కలప, వెదురు కాకుండా వ్యర్థ పదార్థాలు చెరకు నుంచి పంచదార తీసిన తర్వాత మిగిలిన గుజ్జు పదార్థాల నుంచి, గడ్డి ద్వారా కాగితం తయారుచేస్తున్నారు.
ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం సంద‌ర్బంగా ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు వాడ‌కం ఆపి పేపర్‌ బ్యాగులను వాడి మ‌న పర్యావరణాన్ని కాపాడుకుందాం.

☛☛ Daily Current Affairs in Telugu: 12 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

#Tags