World Blood Donor Day: ప్రతి ఏడాది జూన్ 14వ తేదీ ప్రపంచ రక్తదాతల దినోత్సవం

ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఈ దినోత్సవం 1901లో మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించిన ఆస్ట్రేలియాకు చెందిన నోబెల్‌ విజేత కార్ల్‌ లాండ్‌స్టీనర్ జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటారు.

➤ రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేము. కానీ.. రక్తదాతల ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడవచ్చు. 
➤ మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని 2004లో అన్ని దేశాల్లో నిర్వహించారు.
➤ 18 నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు రక్తదానానికి అర్హులు. రక్తదాతల శరీర బరువు కనీసం 50 కిలోలు ఉండాలి.

ఈ సంవత్సరం థీమ్ ఇదే..
ఈ ఏడాది థీమ్ ‘20 సంవత్సరాలుగా విరాళాన్ని జరుపుకుంటున్నారు: రక్త దాతలకు ధన్యవాదాలు!(20 years of celebrating giving: thank you blood donors!)’ 

World Day Against Child Labour: జూన్ 12వ తేదీ ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం.. 

రక్తదానం ఎందుకు ముఖ్యమంటే..
రక్తం అనేది మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన ద్రవం. ఇది ఆక్సిజన్, పోషకాలను మన కణాలకు తీసుకెల్తోంది. వ్యర్థాలను తొలగిస్తుంది, శరీరాన్ని ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు రక్తం లేకపోవడం వల్ల మరణిస్తారు. దీంతో ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, క్యాన్సర్, ఇతర వైద్య పరిస్థితులకు చికిత్స చేయడానికి రక్తం అవసరం. రక్తదాతల నుంచి వచ్చే రక్తం ఈ అవసరాలను తీర్చడానికి సహాయపడుతుంది.

#Tags