Hyderabad Liberation Day: సెప్టెంబర్‌ 17న ‘హైదరాబాద్‌ లిబరేషన్‌ డే’..

నిజాం రాజుపై సైనిక చర్య చేపట్టి హైదరాబాద్‌ను భారతదేశంలో కలిపిన రోజైన సెప్టెంబర్‌ 17కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ప్ర‌తి సంవ‌త్స‌రం సెప్టెంబర్‌ 17న ‘హైదరాబాద్‌ లిబరేషన్‌ డే’ నిర్వహించాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 17ను హైదరాబాద్‌ లిబరేషన్‌ డేగా గుర్తించింది. 1948లో భారతదేశంలో హైదరాబాద్‌ సంస్థానం విలీనం అయిన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకునేందుకు ఈ దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది.
 

  • 1947లో భారతదేశం స్వాతంత్య్రం పొందినప్పటికీ, హైదరాబాద్‌ సంస్థానం నిజాం పాలనలోనే ఉండేది.
  • నిజాం స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేయాలని భావించడంతో, భారత ప్రభుత్వంతో చర్చలు జరిగాయి.
  • చర్చలు ఫలించకపోవడంతో, భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్‌ 13న 'ఆపరేషన్‌ పోలో' అనే సైనిక చర్య చేపట్టింది.
  • సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైంది.

ఈ రోజు ప్రాముఖ్యత ఇదే..

  • ఈ దినోత్సవం హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం అయిన చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేస్తుంది.
  • హైదరాబాద్‌ విమోచనం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకునేందుకు ఒక అవకాశం.
  • భారతదేశ ఐక్యత, సమగ్రతను గుర్తుచేసే ఒక దినోత్సవం.
  • యువతలో దేశభక్తిని, జాతీయవాదాన్ని పెంపొందించే ఒక అవకాశం.

Sudha Murthy: రాజ్యసభకు సుధామూర్తి.. ఆమె తీసుకున్న అవార్డులు ఇవే..

#Tags