Daily Current Affairs in Telugu: 8 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌కు సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌
Daily Current Affairs

1. 2021-22 రాష్ట్రాల విద్యా వ్యవస్థ పనితీరు కేంద్రం విడుదల చేయగా గ్రేడింగ్ ఇండెక్స్నులో 1000 పాయింట్లకు 902 పాయింట్లతో ఏపీకి ప్రథమ స్థానం లభించింది.
2. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌గా డాక్టర్‌ డీవీజీ శంకరరావును ప్రభుత్వం నియమించింది.
3. సింగరేణి సంస్థ చరిత్రలోనే అత్యధికంగా 22-23 ఆర్థిక సంవత్సరం రూ.33,065 కోట్ల టర్నోవర్‌తో రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించినట్లు సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ వెల్లడించారు. 
4. ప్రధాని మోదీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వరంగల్‌లో 3,441 కోట్లతో ఎన్‌హెచ్ 163G మంచిర్యాల-వరంగల్ నాలుగు లైన్ల‌ జాతీయ రహదారికి, రూ. 2,147 కోట్లతో ఎన్‌హెచ్ 563 జగిత్యాల-కరీంనగర్-వరంగల్ నాలుగు లైన్ల జాతీయ రహదారికి, రూ.521 కోట్లతో కాజీపేట రైల్వే వ్యాగన్ నిర్మాణానికి పునాది వేశారు.

☛☛ Daily Current Affairs in Telugu: 7 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

5. నెదర్లాండ్స్‌ ప్రధాని పీఠానికి మార్క్‌ రుట్టే(Mark Rutte) రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాజు విల్లెమ్‌ అలెగ్జాండర్‌కు అందజేశారు. 
6. భారతీయ వ్యాపారవేత్తలకు, పర్యాటకులకు వాణిజ్యం, పెట్టుబడులు, వివిధ సేవలను అందించడం లక్ష్యంగా తైవాన్ తన మూడవ ప్రతినిధి కార్యాలయాన్ని భారతదేశంలోని ముంబైలో ప్రారంభించాలని తన నిర్ణయాన్ని ప్రకటించింది.
7. యూపీలోని వారణాసిలో ప్రధాని మోదీ రూ.12,100 కోట్ల విలువైన 29 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.ఛత్తీస్‌గఢ్‌ పర్యటనలో భాగంగా రాయ్‌పుర్‌లో రూ.7,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
8. ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని గోర‌ఖ్‌పూర్ రైల్వే స్టేష‌న్ నుంచి గోరఖ్‌పుర్‌ - లక్నో, జోధ్‌పుర్‌ - అహ్మదాబాద్‌ (సబర్మతీ) వందేభారత్‌ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే రూ.498 కోట్లతో గోరఖ్‌పుర్‌ రైల్వేస్టేషను ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.

 ☛☛​​​​​​​Daily Current Affairs in Telugu: 6 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

#Tags