Daily Current Affairs in Telugu: 7 జులై 2023 కరెంట్ అఫైర్స్
1. చంద్రయాన్–3 ప్రయోగాన్ని జులై 14న చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) తెలిపింది. మొదటగా ఈ నెల 12న అని ప్రకటించింది. ఆ తర్వాత 13కు వాయిదా వేసింది. తాజాగా, 14న మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగం ఉంటుందని షార్ వర్గాలు ప్రకటించాయి.
2. టాంజానియాలోని జాంజబాలో తొలి ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఈఏ) తెలిపింది.
3. అన్ని రాష్ట్రాలూ పదేళ్ల విద్యుత్ వినియోగానికి ముందుగానే ప్రణాళికలు వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు తొమ్మిదేళ్ల ముందుగానే విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్దేశించింది.జల విద్యుత్ కొనాలంటే తొమ్మిదేళ్ల ముందు, థర్మల్‌కు ఏడేళ్ల ముందు, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లకు ఐదేళ్లు, పవన విద్యుత్‌కు మూడేళ్లు, సౌర విద్యుత్‌కు రెండేళ్ల ముందు ఒప్పందాలు కుదుర్చుకోవాలని కేంద్రం వెల్లడించింది.
☛ Daily Current Affairs in Telugu: 6 జులై 2023 కరెంట్ అఫైర్స్
4. 3 నుంచి ఆరేళ్లలోపు వయసు గల చిన్నారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యం అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న 8.50 లక్షల మంది పిల్లలకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (పీఎస్‌ఈ) కిట్ల పంపిణీ చేపట్టింది. వీటిలో ఒక పలక, 12 రంగుల స్కెచ్ పెన్సిళ్లు, రెండు పెన్సిళ్లు, ఒక రబ్బరు (ఎరేజర్), షార్ప్‌నర్‌తో కూడిన కిట్‌ను ప్రతి విద్యార్థికి అందజేస్తున్నారు.
5. ప్రపంచ బ్యాంకు తాజా లెక్కల ప్రకారం 2022–23లో అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న లేదా పేద దేశాలకు పంపిన మొత్తం 80,000 కోట్ల డాలర్లగా ఉంది. భారత్‌కు విదేశాల్లోని భారతీయులు పంపిన వంద బిలియన్ డాలర్లతో తొలి స్థానంలో ఉండగా , అరవై బిలియన్ డాలర్లతో మెక్సికో రెండో స్థానంలో ఉంది.
6. ప్రత్యేకమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించే వర్చువల్ బ్రాంచ్ PNB మెటావర్స్‌ను ప్రారంభించినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ప్రకటించింది.
☛ Daily Current Affairs in Telugu: 5 జులై 2023 కరెంట్ అఫైర్స్