Daily Current Affairs in Telugu: 28 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
28 october Daily Current Affairs in Telugu

1. ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత రైఫిల్‌ షూటర్లు అర్జున్‌ బబుతా, తిలోత్తమ సేన్‌ రజత పతకాలు సాధించారు. ఇదే విభాగంలో టీమ్‌ ఈవెంట్‌లో అర్జున్, దివ్యాన్ష్‌, హృదయ్‌ హజారికా (1892.4 పాయింట్లు) త్రయం బంగారు పతకం గెలిచింది. తిలోత్తమ, శ్రీయాంక, రమితలతో కూడిన మహిళల బృందం కాంస్యం సాధించారు. సీనియర్‌ స్కీట్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో అనంత్‌జీత్‌ సింగ్, దర్శన రాథోడ్‌ జోడీ 139 పాయింట్లతో స్వర్ణం గెలిచింది. 

2. ఆసియా పారా క్రీడల్లో శీతల్‌ దేవి రాకేశ్‌ కుమార్‌తో కలిసి  మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో శీతల్‌ దేవి 144–142తో అలీమ్‌ నూర్‌ సియాదా (సింగపూర్‌)పై గెలిచింది. తద్వారా ఒకే ఆసియా పారా ఈవెంట్‌లో రెండు బంగారు పతకాలు గెలిచిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కింది. పారాలింపిక్‌ చాంపియన్‌ అయిన షట్లర్‌ ప్రమోద్‌ భగత్, మహిళల్లో తులస్మతి మురుగేశన్, పురుషుల డబుల్స్‌లో నితేశ్‌–తరుణ్‌ జోడీ బంగారు పతకాలు సాధించారు.

Daily Current Affairs in Telugu: 27 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న ఆసియా  పారా క్రీడల్లో భారత్‌  వంద పతకాల మైలురాయిని అందుకుంది.  ఆసియా పారా క్రీడల్లో అథ్లెట్‌ దిలీప్‌ మహదు గవిత్‌ పురుషుల 400 మీటర్ల పరుగును 49.48 సెకన్లలో పూర్తి చేసి పసిడి గెలిచి సెంచరీ మెడల్స్‌ లాంఛనం పూర్తి చేశాడు.

4. తన చుట్టూ నిత్యం చూస్తున్న ప్రకృతి, జీవరాశులనే తన కలంతో రాస్తూ అద్భుతమైన కవితలు రాస్తున్న కరీంనగర్‌కు చెందిన ప్రీతి తాజాగా తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు అయింది.

5. ప్రపంచ అండర్‌–23 రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా రితిక హుడా చరిత్ర సృష్టించింది. 

Daily Current Affairs in Telugu: 26 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

#Tags