Daily Current Affairs in Telugu: 13 డిసెంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
13 december daily Current Affairs in Telugu

1. ప్రభుత్వ రంగ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2023కి గాను ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్‌ ఇంటెలిజెన్స్‌ (ఐబీఎస్‌ఐ) గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఇన్నోవేషన్‌ అవార్డును దక్కించుకుంది. 

2. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన కీలకమైన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీలు) బిల్లు–2023ని కేంద్రం మంగళవారం రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదించింది.

Daily Current Affairs in Telugu: 12 డిసెంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. 2040 ఏడాదికల్లా చంద్రుడిపై భారతీయ వ్యోమగామి అడుగుపెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఇస్రో చీఫ్‌ ఎస్‌.సోమనాథ్‌  చెప్పారు. 

4. ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధ క్షేత్రం సియాచిన్‌లో ప్రప్రథమ మహిళా వైద్యాధికారిగా కెప్టెన్‌ ఫాతిమా వసీమ్‌ రికార్డు సృష్టించనున్నారు.

5. ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల్ని నిర్దేశించే ఐక్యరాజ్యసమితి(ఐరాస)కి చెందిన అత్యంత కీలకమైన కమిటీలో భారత్‌ సభ్య దేశంగా ఎన్నికైంది. 

6. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని 1973లో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన చరిత్రాత్మక తీర్పు ప్రస్తుతం తెలుగుసహా 10 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది.

Daily Current Affairs in Telugu: 11 డిసెంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

#Tags