Daily Current Affairs in Telugu: 12 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
1. దేశంలో రూపొందిన అతి పెద్ద సర్వే నౌక ఐఎన్‌ఎస్ సంధాయక్ భారత నౌకాదళంలో చేరింది.
2. బల్క్ డ్రగ్ పార్కును కాకినాడ నుంచి అనకాపల్లి జిల్లా నక్కపల్లికి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Daily Current Affairs in Telugu: 11 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
3. సైన్యానికి చెందిన కెప్టెన్ గీతిక కౌల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌లో విధులు నిర్వర్తించనున్న తొలి మహిళా మెడికల్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించారు.
4. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఓసీ సామాజిక వర్గానికి చెందిన భజన్‌లాల్ శర్మను బీజేపీ ప్రకటించింది.
5. పోలండ్ పార్లమెంటులో జరిగిన అవిశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో పోలండ్ ప్రధాన మంత్రి మాథ్యూస్ మొరావెస్కీ ప్రభుత్వం కుప్పకూలింది. ఐరోపా యూనియన్ మాజీ నేత డొనాల్డ్ టస్క్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది.
Daily Current Affairs in Telugu: 09 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్