Women Icon Award: వలంటీర్ జ్యోతికి ఉమెన్ ఐకాన్ అవార్డు
అల్లవరం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదారాబాద్‌లో ఫిలాంత్రోఫిక్ సోసైటీ ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీ జరిగిన మహిళా దినోత్సవంలో అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామానికి చెందిన కట్టా జ్యోతికి ఎమ్మెల్సీ సురభి వాణిదేవి జాతీయ ఉమెన్ ఐకాన్ 2024 అవార్డుని అందించారు.
రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, నల్గొండలోని ఓల్డేజ్ హోమ్ చేసిన సేవలకు గాను ఈ అవార్డు వరించిందని జ్యోతి తెలిపింది. 2008లో బైర్రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా అవార్డుని అందుకున్నానని, 2010 క్రీడల్లో 2014 మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డులు వరించాయన్నారు.
ఉభయ రాష్ట్రాల పరిధిలో జరిగిన మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహరావు కుమార్తె సురభి చేతుల మీదుగా జాతీయ స్థాయిలోవుమెన్ ఐకాన్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని జ్యోతి తెలిపింది. అల్లవరం మండలం కొమరగిరిపట్నం–3 సచివాలయంలో క్లస్టర్–5లోని 50 కుటుంబాలకు వలంటీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాని జ్యోతి తెలిపింది. ఈ అవార్డుతో సామాజిక సేవే లక్ష్యంగా బాధ్యతగా వ్యవహరిస్తానని తెలిపింది.
National Award: సీహెచ్‌ఓ యామినీకి జాతీయ అవార్డు
#Tags