Kiran Mazumdar Shaw: కిరణ్‌ మజుందార్‌ షాకు జెంషెడ్‌జీ టాటా అవార్డు

బయోకాన్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షాకు ప్రతిష్టాత్మక జెంషెడ్‌జీ టాటా అవార్డు లభించింది.

దేశంలో బయోసైన్సెస్ ప్రగతికి మార్గదర్శకత్వం వహించి ప్రపంచవ్యాప్తంగా ఆమె చేసిన విశేషమైన కృషిని గుర్తిస్తూ ఇండియన్‌ సొసైటీ ఫర్‌ క్వాలిటీ (ఐఎస్‌క్యూ) ఈ పురస్కారాన్ని ప్రకటించింది. 2004లో ఐఎస్‌క్యూ ఈ అవార్డును ప్రారంభించింది. భారతీయ సమాజానికి గణనీయ సేవలు అందించిన వ్యాపార దిగ్గజాలను గుర్తించి ఐఎస్‌క్యూ ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. 

బెంగళూరులో ఏర్పాటు చేసిన ఐఎస్‌క్యూ వార్షిక కాన్ఫరెన్స్‌లో మజుందార్-షా మాట్లాడుతూ 'ఐఎస్‌క్యూ అందిస్తున్న 2024 జంషెడ్‌‌జీ టాటా అవార్డును అందుకోవడం నాకు చాలా గౌరవంగా ఉంది. ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది భారతదేశపు గొప్ప దార్శనికుడి పేరుతో ఉంది. ఆయన వారసత్వం, ఆవిష్కరణ, దేశ నిర్మాణం మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది' అన్నారు.

Indira Gandhi Peace Prize: చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇందిరా గాంధీ శాంతి బహుమతి

ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళ
బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా తన ప్రయాణాన్ని గ్యారేజీలో ప్రారంభించి, దేశపు అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచారు. తాజాగా  ఆమె 3.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.29,050 కోట్లు) నికర విలువతో ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల్లో స్థానం సంపాదించారు. ఈ లిస్ట్‌లో 82వ స్థానంలో నిలిచిన కిరణ్ మజుందార్ షా భారత్‌లోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో 91వ స్థానంలో ఉన్నారు.

#Tags